బాలయ్యను బా*** అని బండ బూతులు తిట్టిన సిల్క్ స్మిత.. కారణం అదే !!


నందమూరి నటసింహం బాలకృష్ణకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా బాలయ్య అంటే ఒక సింహం లానే ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఆయన అంటే ఒక సీరియస్ మ్యానరిజం ఉన్న వ్యక్తి గానే ఎక్కువగా భావిస్తుంటారు. అందుకు తగ్గట్టు గానే ఏ హడావిడి లేకుండా అన్నీ తానై చూసుకుంటారు బాలయ్య. పలు సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులపై కూడా ఆయన చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

Advertisement

అయితే సీనియర్ స్టార్ హీరో అయిన బాలయ్యను అందరి ముందు "దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్" అంటూ బండ బూతులు తిట్టారు అంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆయనను తిట్టిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు దక్షిణ భారతీయ సినీ చరిత్రలో గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన నటి "సిల్క్ స్మిత". మత్తెక్కించే కళ్లతో, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, బోల్డ్ పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. దాదాపు దశాబ్దన్నర పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అందం, నటన, డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు. ఆమె బాలయ్యను తిట్టడం ఏంటని సర్వత్రా షాక్ అవుతున్నారు.

Advertisement

అసలు ఏం జరిగిందంటే..

బాలకృష్ణ కెరీర్ లో టాప్ చిత్రంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ "ఆదిత్య 369". 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సిల్క్ స్మిత కేవలం ఒక ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాకుండా.. సింహనందిని అనే ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. కాగా మూవీలో బాలకృష్ణ పోషించిన కృష్ణ కుమార్ పాత్రను ఉద్దేశించి ఆమె "ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు" అంటూ తెలుగులో పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది.

Advertisement

కానీ సిల్క్ స్మితకు తెలుగు అంతగా రాదని అందరికీ తెలిసిందే. ఇక్కడ మరీ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే.. ఆ డైలాగ్‌లో తెలుగు మాత్రమే కాకుండా గ్రాంథికం కూడా ఉండడం. అయితే షూటింగ్ టేక్ ప్రారంభం కాగానే.. సిల్క్ స్మిత ఆ తెలుగు డైలాగ్‌ను పూర్తిగా మర్చిపోయారట. దాంతో ఆమె తెలుగుకు బదులుగా ఇంగ్లీషులోకి మారిపోయి.. బాలకృష్ణను చూపిస్తూ.. "దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్" (This fool, This idiot, This bastard, This rascal) అంటూ చాలా కోపంగా తిట్టేశారట. ఆ తర్వాత డైరెక్టర్‌ వైపు తిరిగి "డైరెక్టర్ గారు.. ఓకేనా అండి?" అని అడిగారట.

Advertisement

అప్పుడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్పందిస్తూ.. నవ్వుతూ "ఓకే ఏంటమ్మా.. నువ్వు మాట్లాడిందంతా ఇంగ్లీషు, పైగా అన్ని తిట్లే తిట్టావు" అని చెప్పారట. కానీ సిల్క్ స్మిత నోటి వెంట బాలకృష్ణ లాంటి స్టార్ హీరోపై ఆ రేంజ్ ఇంగ్లీష్ తిట్లు వినేసరికి సెట్‌లో ఉన్నవారంతా ముందు షాక్ అయ్యారట. సింగీతం అలా అన్న తర్వాత సెట్‌లో అందరూ మళ్లీ నవ్వుకున్నారని బాలకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English Summary

Nandamuri Natasimham Balayya has no need to talk about the craze that exists across the country. He has a huge following for his mass dialogues and powerful screen presence on screen.