నేషనల్ క్రష్, ప్రముఖ నటి రష్మిక మందన్న ఓ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు.షూటింగ్లో హై-ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న క్రమంలో అనుకోకుండా కాలు జారడంతో రష్మిక మందన్న కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రష్మిక తుంటి భాగానికి బలమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సినిమా యూనిట్ సభ్యులు రష్మికను తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రష్మికను పరీక్షించిన వైద్యుల బృందం తుంటి భాగంలో తీవ్రమైన గాయమైందని నిర్ధారించారు.
ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!
6 వారాల పాటు బెడ్ రెస్ట్
గాయం తీవ్రత నేపథ్యంలో రష్మిక పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీనివల్ల రష్మిక కొద్ది రోజుల పాటు అన్ని రకాల సినిమా షూటింగ్ లకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రష్మిక మందన్న గాయపడిన వార్త తెలుసుకున్న అభిమానులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక త్వరగా కోలుకుని మళ్లీ మునుపటి ఉత్సాహంతో సెట్స్ లోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక మందన్న ప్రస్తుతం తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి 'రౌడీ జనార్దన్' సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం రష్మిక డైరెక్టర్ రవీంద్ర ఫుల్లె దర్శకత్వంల 'మైసా' అనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనున్నారు. 'మైసా'కు సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు, నీటిలో నటించే సీక్వెన్సులను ఇటీవల పూర్తి చేశారు. తాజాగా ఓ పాటను షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బోల్డ్ సీన్స్‌తో రచ్చ రచ్చ... 'టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!