ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు: ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన!


ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 'RAW NTR' సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR'కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ కు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటించింది. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ఎన్టీఆర్ ఆఫీస్ వర్గాలు కోరాయి.

Advertisement
Jr NTR: జూలై 18న జరిగే ఈవెంట్‌ పేరు ఇదే!
Advertisement

ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశ ప్రకటన అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ కార్యాలయం ఈమేరకు ప్రకటించింది. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రాగా.. సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రచారం అంతా ఉత్త ప్రచారమే అని చెప్పేందుకు ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనితో ఈ విషయానికి సంబంధించి అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతున్నట్లుగా ఆశిస్తున్నామని పేర్కొంది.

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ అనౌన్స్‌మెంట్..? ముహూర్తం ఫిక్స్..!!

English Summary

No Connection With RAW NTR, Jr.NTR Office Clarifeis They have no links with RAW NTR Group. End to all rumors surroundin NTR Political Entry.