రెండు నెలలకు ఓసారి హిట్టు ఎలా కొడతావ్ అన్నా..!


వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ హీరోగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు తిరువీర్. ఆయన కథానాయకుడిగా, వర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'ఓ సుకుమారి'. అమ్మాయి ఒంట్లో కరెంట్ ప్రవహిస్తుంది... ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే సరికొత్త వినూత్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

Advertisement

కథ

యాదగిరి (తిరువీర్) ఓ పెళ్లి సంబంధం చూడటానికి వేరే ఊరు వెళతాడు. అక్కడ దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి, మొదటి చూపులోనే ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, దామినికి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఆమె ఎవరిని ముట్టుకున్నా ఎదుటి వ్యక్తికి గట్టిగా షాక్ కొడుతుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి పెద్దలు వీరిద్దరికీ నిశ్చితార్థం, పెళ్లి జరిపిస్తారు. తమ తాతయ్య రాసిన వీలునామా ప్రకారం... మనవళ్ళలో ఎవరికి మొదట మగబిడ్డ పుడితే, వాళ్ళకే కోట్ల విలువైన ఎకరాల ఆస్తి సొంతం అవుతుంది. మరి ఈ కరెంట్ షాక్ సమస్య మధ్య యాదగిరి, దామిని దంపతులకు మగబిడ్డ పుట్టాడా? ఊరి సర్పంచ్ ఎన్నికలు వీరి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? చివరకు ఈ జంట ఎలా ఒక్కటయ్యారు? అనేదే సినిమా కథ.

Advertisement
రాజమౌళి తదుపరి చిత్రం ఎవరితోనో తెలిసిపోయింది..?

విశ్లేషణ

కాన్సెప్ట్ పరంగా 'ఓ సుకుమారి' కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వైవిధ్యమైన పాయింట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా ప్రారంభం నుండి హీరో హీరోయిన్ల పరిచయం, ఆ షాక్ కొట్టే సీన్స్ ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేస్తాయి. కథలో వచ్చే ట్విస్ట్‌లు, వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.

నటీనటుల ప్రతిభ

యాదగిరి పాత్రలో తిరువీర్ మరోసారి తన అద్భుతమైన నటనను కనబరిచారు. చాలా సహజంగా నటిస్తూ, తన మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్‌తో సినిమాను ముందుకు నడిపించారు. దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఒదిగిపోయారు. కేవలం సెంటిమెంట్, కామెడీ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఆమె అద్భుతమైన యాక్షన్ సీన్స్ కూడా చేశారు. ముఖ్యంగా టెంపుల్ ఫైట్ సీక్వెన్స్‌లో ఆమె నటనకు థియేటర్లలో క్లాప్స్ పడతాయి. ఐశ్వర్య తండ్రిగా ఆనంద్ చక్కటి నటన కనబరిచారు. ఆమని, మురళీధర్ గౌడ్, ఝాన్సీ, శ్రీనివాస్ గవిరెడ్డి, జీవన్, మై విలేజ్ షో అంజిమామ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

Advertisement
హీరోగా నారా లోకేష్ మిస్ చేసుకున్న చిత్రం

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు సాంకేతిక విభాగం పెద్ద అసెట్‌గా నిలిచింది. యువ సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు అద్భుతమైన పనితీరు కనబరిచారు. పాటలు వినసొంపుగా ఉన్నాయి, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ సుకుమారి' ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఎంటర్‌టైనర్. నటీనటుల ప్రతిభ, బలమైన సాంకేతిక విభాగం, మెప్పించే సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పటికీ... సినిమా ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో బజ్ కలగలేదు. సరైన పబ్లిసిటీ ఇచ్చి ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత పెద్ద విజయాన్ని నమోదు చేసుకునేది. ఏదేమైనా, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు 'ఓ సుకుమారి' కచ్చితంగా నచ్చుతుంది.

Advertisement

రేటింగ్: 3/5

English Summary

Oh Sukumari: Read the honest review and rating of Thiruveer and Aishwarya Rajesh’s latest Telugu movie .