ఈ వెబ్ సిరీస్ చూస్తే ఫోన్‌కి బై చెప్పేస్తారు.. మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ !!


ప్రస్తుతం ఓటీటీ హవా గట్టిగా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం వందలాది సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. క్రైమ్, కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ డ్రామాలకు మంచి ఆదరణ లభిస్తుంది. భాషతో సంబంధం లేకుండా మంచి స్టోరీలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు ఈ వారం సందడి చేస్తున్నాయి.

Advertisement

సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతోంది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండడంతో ఈ సిరీస్ కు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు టాప్ రేటింగ్ లభించింది. అయితే గత వారం (జులై 03) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. మొబైల్ ఫోన్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఊహించని రేంజ్ లో భారీ వ్యూయర్ షిప్ వస్తోంది.

Advertisement

ఏ సిరీస్ అంటే..

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు 'ప్రీతమ్ అండ్ పెడ్రో'. "పాతాళ్ లోక్" ఫేమ్ అవినాష్ అరుణ్ ధవారే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ సిరీస్‌కు స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు. ప్రీతమ్‌గా వీర్ హిరానీ, పెడ్రో అనే పోలీస్ అధికారిగా అర్షద్ వార్సి నటించగా.. హ్యాకర్ మార్టిన్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అదరగొట్టాడు. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. అవుతున్న ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 35 నిమిషాల నిడివి ఉంటుంది. IMDBలో టాప్ రేటింగ్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బోజ్‌పురి భాషల్లో అందుబాటులో ఉంది.

Advertisement

స్టోరీ ఏంటంటే..

ప్రీతమ్ వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ గోవాలో తన తాతయ్యతో కలిసి జీవిస్తుంటాడు. ఒక రోజు తన తాతకు ఇష్టమైన టేప్ రికార్డర్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అక్కడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పెడ్రో పనిచేస్తుంటాడు. ప్రీతమ్ వచ్చిన సమయంలోనే ఆ స్టేషన్ కు ఒక హై-ప్రొఫైల్ ఏటీఎం దొంగతనం కేసు వస్తుంది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్న పోలీసులకు.. ప్రీతమ్, తనకు తన టేప్ రికార్డర్ తెచ్చి పెడితే ఏటీఎం దొంగలను పట్టుకుంటానని చెబుతాడు.

Advertisement

అందుకు పోలీసులు కూడా ఒకే చెప్పడంతో.. ప్రీతమ్ తన కంప్యూటర్‌ను ఉపయోగించి కేవలం పది నిమిషాల్లో ఏటీఎం దొంగల ఆచూకీని కనుగొంటాడు. అలా సైబర్ కేసుల విచారణలో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. సరిగ్గా అదే సమయంలో ఒక మంత్రి కుమారుడు మిస్ అవుతాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అసలు ప్రీతమ్ గతం ఏంటి ? ఏటీఎం దొంగలను ఎలా పట్టుకున్నాడు? ఎందుకు టెక్నాలజీని వదిలేసి సేల్స్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నాడు? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే...

English Summary

The OTT trend is currently in full swing. Hundreds of movies and web series are being released every week around the world. Crime, comedy, psychological thrillers, horror, and romantic dramas are gaining popularity.