సోషల్ మీడియా సంచలనం, ప్రముఖ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఆమెను ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రియా ప్రకాష్ వారియర్ కాషాయ రంగు గౌను ధరించి కనిపించడమే దీనికి కారణం. కేవలం ఓ సాధారణ దుస్తుల రంగుపై కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం పట్ల నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రియా ప్రకాష్ వారియర్‌ను ఆ యూట్యూబర్ ఏమని ప్రశ్నించారు? యూట్యూబర్ తీరుపై నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మళ్లీ లీకైన 'వారణాసి' సీన్స్.. సెట్స్ నుంచి మహేష్ వీడియో వైరల్!
ఆ కార్యక్రమం సందర్భంగా ఓ యూట్యూబర్ ప్రియా ప్రకాష్ వారియర్ ను ఉద్దేశించి.. "మీరు కాషాయ రంగు దుస్తులే ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనుక ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?" అని ప్రశ్నించారు. ఈ వింత ప్రశ్నకు ప్రియా ప్రకాష్ వారియర్ చాలా సున్నితంగా అంతే సమయస్ఫూర్తితో సమాధానమిచ్చారు. తన ఎంపిక వెనుక ఎలాంటి రాజకీయ లేదా మతపరమైన ఉద్దేశాలు లేవని.. కేవలం ఆ దుస్తులు తనకు నచ్చడం వల్లే ధరించానని స్పష్టం చేశారు. దీంతో ఆ రంగు ఎంపికలో ఎలాంటి ప్రత్యేక అజెండా లేదని తేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతండగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు కొంత మంది మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తారో కూడా తెలియదు.. కేరళలో కాషాయ రంగు దుస్తులు ధరిస్తే కూడా కారణం చెప్పాలా?.. రంగురంగుల బట్టలు ధరించే వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? అని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్ చాలా శాంతంగా సమాధానం చెప్పినప్పటికీ.. ఈ ఘటన వ్యక్తిగత స్వేచ్ఛ, పాత్రికేయ నైతికతపై పెద్ద చర్చకు తెరలేపింది. ఇండియాలో కాషాయ రంగుకు సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఓ వ్యక్తి కేవలం ఆ రంగు దుస్తులు ధరించినంత మాత్రాన దానిని రాజకీయ ప్రకటనగా లేదా నిర్దిష్ట భావజాలానికి అనుబంధం చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు అడగడం సరైనది కాదని.. వ్యూస్ కోసం అనవసర వివాదాలు సృష్టించొద్దని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదే..