రాజమౌళి కోడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న జక్కన్న సాధించిన అంతర్జాతీయ విజయాల వెనుక ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ కృషి ఎంతో ఉంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ పురస్కారం లభించడంలో కార్తికేయ ప్రచార వ్యూహం కీలక పాత్ర పోషించింది. 24 క్రాఫ్ట్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆయన, త్వరలోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
'మగధీర’ సినిమా చేయనన్న హీరోతో రాజమౌళి తర్వాత సినిమా ఫిక్స్
Advertisement

పూజాప్రసాద్ బ్యాక్ గ్రౌండ్

ఈ క్రమంలో రాజమౌళి ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన పూజా ప్రసాద్ నేపథ్యం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జగ్గూభాయ్ కుటుంబానికి చెందినవారే. పూజ తాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ 'దసరా బుల్లోడు', 'ఆరాధన', 'అంతస్తులు', 'బంగారు బుల్లోడు' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. పూజ తండ్రి రాంప్రసాద్ కాగా, ప్రముఖ నటుడు జగపతి బాబు ఈమెకు స్వయానా పెద్దనాన్న అవుతారు.

గుండె ధైర్యం ఉంటేనే ఈ థ్రిల్లర్ సినిమా చూడండి.. రూ.7కోట్లకు రూ.4వేల కోట్లు వచ్చాయి
Advertisement

ఆ రకంగా రాజమౌళి, జగపతి బాబు కుటుంబాలు వియ్యమందాయి. ఒక వైపు ఇంత పెద్ద సినీ వారసత్వం ఉన్నప్పటికీ, పూజా ప్రసాద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆమె స్వయంగా మంచి గాయని కావడంతో పలు భక్తి గీతాలు ఆలపించి సంగీత ప్రియుల ఆదరణ పొందారు. జైపూర్ వేదికగా కార్తికేయ, పూజల వివాహం సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

రాజకీయంగా పరిచయాలు

చిత్రపరిశ్రమలోనే కాక, ఈమె కుటుంబానికి రాజకీయ వర్గాల్లోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల తిరుమలలో కార్తికేయ-పూజ జంట నారా లోకేష్‌తో ముచ్చటించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. "మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా?" అని లోకేష్ సరదాగా ప్రశ్నించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పింది. ఇలా అటు సినీ, ఇటు రాజకీయ నేపథ్యాలతో నందమూరి, మెగా, అక్కినేని కుటుంబాల కోడళ్లతో సమానంగా రాజమౌళి కోడలు పూజా ప్రసాద్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

English Summary

Rajamouli daughter-in-law, Pooja Prasad, has an impressive background; she has connections and family ties with prominent figures from both political and film circles.