దాదా ను దించేశాడు: సూపర్ బయోపిక్- స్టార్ హీరో: టైటిల్ రిలీజ్ డేట్ రివీల్.. !!


నేడు.. భారత క్రికెట్ చరిత్రను సరికొత్త మలుపు తిప్పిన అసాధారణ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ అద్భుత కానుక అందింది. గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ 'దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. విడుదల తేదీ కూడా ఇందులో పొందుపరిచారు.

Advertisement

ఈ క్రేజీ బయోపిక్‌లో సౌరవ్ గంగూలీ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు నటిస్తోన్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. క్రికెట్ ప్రేమికులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసే లుక్ ఇది. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ విజయం తర్వాత.. లార్డ్స్ స్టేడియం బాల్కనీలో గంగూలీ తన వంటి పై నుంచి జెర్సీని గాల్లోకి ఊపిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ చారిత్రాత్మక క్షణాన్ని ఈ పోస్టర్ ద్వారా ఎంతో సహజంగా ఆవిష్కరించాడు రాజ్ కుమార్ రావు. ఈ మూవీతో భారత క్రికెట్ జట్టుకు సరికొత్త దూకుడును నేర్పిన గంగూలీ ప్రస్థానం మన కళ్ల ముందుకు రాబోతోంది. ఓ సాధారణ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా జట్టులో అడుగు పెట్టిన సౌరభ్ గంగూలీ.. క్రమంగా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన తిరుగులేని కెప్టెన్‌గా ఎదిగే వరకు ఆయన సాగించిన ప్రస్థానాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది.

ఈ చిత్రానికి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తోన్నాడు. లవ్ రంజన్, అంకుర్ గర్గ్‌లు నిర్మిస్తోన్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్, డీబీఎల్ సమర్పిస్తోన్నాయి. ఈ బయోపిక్‌లో నటి తాన్యా మణిక్తాలా సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ పాత్రను పోషిస్తోన్నారు.

Advertisement

యువ ప్రతిభను గుర్తించి, వారి వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఆయన పోషించిన పాత్ర అసాధారణమైనది. గ్రౌండ్ లో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఈ బయోపిక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్యారెక్టర్ కోసం రాజ్‌కుమార్ రావు ఎంతో శ్రమించాడనేది ఫస్ట్ లుక్ ను చూస్తే తెలిసిపోతుంది. ఈ బయోపిక్ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 'దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ చిత్రాన్ని 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని ఖరారు చేశారు.

Advertisement

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలపై సౌరవ్ గంగూలీ సైతం స్పందించారు. తన జన్మదినం రోజే ఈ అప్‌డేట్ రావడం ఓ మరిచిపోలేదని అనుభూతిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు నటనపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రాజ్‌కుమార్ రావు అభినయం, సౌరవ్ గంగూలీ కెరీర్‌లోని చారిత్రాత్మక ఘట్టాలు ఈ సినిమాపై ఎన్నో అంచనాలను మోసుకువస్తున్నాయి.

English Summary

Rajkummar Rao Unveils as Sourav Ganguly in Dada: The Sourav Ganguly Story: 1st Look, Release Date Out. Along with the reveal, the makers also announced the film s theatrical release on 14th May 2027 over an extended holiday weekend.