ముందు అల్లు అర్జున్ అనుకుంటే చేతులు మారి బ్లాక్‌బస్టర్ కొట్టిన రామ్


సినీ పరిశ్రమలో ఒకరి జాతకం మారాలంటే ఒక్క సినిమా చాలు. అలాగే ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం, అది కాస్తా ఇండస్ట్రీని షేక్ చేసే బ్లాక్‌బస్టర్ అవ్వడం టాలీవుడ్‌లో తరచూ చూస్తూనే ఉంటాం. అయితే, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వదులుకున్న ఒక భారీ ప్రాజెక్ట్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌కు మైలురాయిగా మారుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆ సినిమానే టాలీవుడ్‌ను ఊపేసిన లవ్ స్టోరీ 'దేవదాసు'. కానీ, ఈ సూపర్ హిట్ వెనుక టాలీవుడ్ టాప్ మేకర్స్ మధ్య నడిచిన అసలు కథ వేరే ఉంది.

Advertisement
థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ధురంధర్ 2 రికార్డులు బద్దలు.. ఈ మూవీని ఇప్పుడే చూసేయండి..!
Advertisement

అల్లు అర్జున్ కోసం అరవింద్ పెట్టిన కండిషన్!
2004-2005 ప్రాంతంలో టాలీవుడ్‌లో వై.వి.ఎస్. చౌదరి అంటే మాస్ పల్స్ తెలిసిన క్రేజీ డైరెక్టర్. ఆయన మనసులో మెదిలిన ఓ అద్భుతమైన ప్రేమకథకు మొదట హీరోగా అనుకున్నది అల్లు అర్జున్‌నే. ఈ ప్రాజెక్ట్‌కు "బాలరాజు" అనే క్యాచీ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ ఈ కథకు పక్కాగా సెట్ అవుతాయని వైవీఎస్ భావించారు. ఇదే విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దగ్గర ప్రస్తావించగా.. ఆయన ఒక కండిషన్ పెట్టారు. అప్పటికే అల్లు అర్జున్ నటిస్తున్న 'ఆర్య' సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిద్దామని అరవింద్ చెప్పారు.

Advertisement

దర్శకుడి మనసులో 'సందేహం'!
కథ రెడీగా ఉంది, హీరో ఓకే అన్నారు.. కానీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మనసులో ఒక చిన్న సందేహం మొదలైంది. 'ఆర్య' సినిమా విడుదలయ్యాక, ఒకవేళ అక్కడ ఫలితం అటు ఇటు అయితే ఈ 'బాలరాజు' ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం ఆయనను వెంటాడింది. ఆలస్యం చేయడం ఇష్టం లేక, ఈ కథను ఒక సరికొత్త కుర్రాడితోనే తెరకెక్కించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఆఫీసులో ఒక అబ్బాయి ఫొటోలు వైవీఎస్ కంటపడ్డాయి. ఆ కళ్లల్లో ఉన్న స్పార్క్, ఫేస్‌లో ఉన్న గ్లో చూడగానే.. "ఈ అబ్బాయిలో పక్కా హీరో మెటీరియల్ ఉంది.. నా సినిమాకు ఇతడే కరెక్ట్" అని రవికిషోర్‌ను అడిగారు వైవీఎస్. అప్పటికి రామ్‌ను 'యువసేన' రీమేక్‌తో లాంచ్ చేయాలని రవికిషోర్ భావించినప్పటికీ, వైవీఎస్‌పై ఉన్న నమ్మకంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Advertisement
'రోజూ ఒక గంటసేపు చేయండి': అనసూయ వీడియో వైరల్

కోలీవుడ్‌ను వదులుకుని
మరోవైపు రామ్‌కు కూడా అప్పట్లోనే తమిళంలో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'కాదల్' సినిమాలో హీరోగా నటించే బంపర్ ఆఫర్ వచ్చింది. కానీ, రామ్ టాలీవుడ్ ఎంట్రీపైనే నమ్మకం ఉంచి ఆ కోలీవుడ్ ఛాన్స్‌ను వదులుకున్నాడు. ఇక ఇటు పక్క 'ఆర్య' సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాంతో అల్లు అరవింద్ స్వయంగా వైవీఎస్ చౌదరిని పిలిచి, బన్నీతో సినిమా చేయడానికి డేట్స్ ఇస్తామని చెప్పారు. కానీ అప్పటికే రామ్‌కు మాట ఇచ్చిన వైవీఎస్.. టెంప్ట్ అవ్వకుండా, తన మాట తప్పకుండా కొత్త కుర్రాడితోనే ముందుకు వెళ్లారు. అలా 'బాలరాజు' కాస్తా టైటిల్ మారి ఇలియానా హీరోయిన్‌గా 2006లో 'దేవదాసు' రూపంలో థియేటర్లలోకి వచ్చింది. తొలి సినిమాతోనే రామ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

English Summary

Ram Pothineni Devadasu Movie, Initially there was a plan to make the movie Devadasu with Allu Arjun as the lead, under the title Balaraju. However, YVS Chowdary eventually made the film with Ram under the title Devadasu and delivered a blockbuster.