'రామాయణ' ట్రైలర్‌ సంచలన రికార్డ్.. 800 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ టాప్ 3 రేసులో..!

భారతీయ చిత్ర సీమ గర్వించదగిన విధంగా తెరకెక్కిన మూవీ 'రామాయణ'.. బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల అంటే జూలై 30న బ్రాహ్మి ముహూర్తంలో విడుదలైంది. ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన రికార్డుల్ని నమోదు చేస్తోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రామాయణ ట్రైలర్ ఏకంగా 800 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

Advertisement

ఈ వ్యూస్ కేవలం యూట్యూబ్‌ లో వచ్చినవి మాత్రమే కాకుండా.. ఇతర సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్, ఎక్స్ లో నమోదైన మొత్తం వ్యూస్‌ గా సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వ్యూస్ పరంగా వరల్డ్ లోనే టాప్ 3 ట్రైలర్ గా దూసుకెళ్తోంది. ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అలాగే అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్స్ తర్వాత ఆ రేంజ్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ట్రైలర్ గా 'రామాయణ' ట్రైలర్‌ నిలిచింది.

Advertisement
ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'

రామాయణ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ విజువల్ ఎపిక్ కోసం భారతీయ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా విడుదల కానుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యధిక బారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ రామాయణ కావడం విశేషం. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నికల్ టీమ్, భారీ సెట్లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

Advertisement

ట్రైలర్‌ లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ సంగీతం అందించడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రామాయణ మూవీలో శ్రీ రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కనిపిస్తుండగా.. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తోంది. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్.. ఇక రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు.