ప్రభాస్ కల్కి - 2 లో అలియా భట్.. డార్లింగ్ హింట్ ఇచ్చేశాడుగా !!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం " కల్కి". నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అమితాబ్ ముఖ్య పాత్రలో నటించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వనీదత్ వ్యవహరించారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఇండియన్ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భైరవ పాత్రను కర్ణుడితో లింక్ చేయడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ "కల్కి 2" మీదే ఉంది.

Advertisement

కాగా దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి ఆమె స్థానంలో నటించేది ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది. మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారని టాక్ నడిచింది. కాగా ఇప్పటికే సాయి పల్లవికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర సాయి పల్లవి నుంచి అలియా భట్ చేతికి వెళ్ళినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

ప్రభాస్ విషెస్..

అలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూనివర్స్ యాక్షన్ ఫిల్మ్ "ఆల్ఫా". yrf బ్యానర్ పై భాతి బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ షేర్ చేస్తూ.. "ఆల్ఫా ట్రైలర్ అమేజింగ్‌గా ఉంది. ఆలియా భట్, వైఆర్ఎఫ్ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్" అంటూ పోస్ట్ పెట్టారు. అందుకు అలియా భట్ రియాక్ట్ అవుతూ "థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్ ప్రభాస్" అంటూ ఆ స్టోరీని రీ-షేర్ చేసింది. అయితే సాధారణంగా ప్రభాస్ హిందీ సినిమాల ప్రమోషన్స్ కి బూస్టప్ ఇస్తూ ఇలా పోస్ట్ పెట్టడం చాలా తక్కువ. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఈ పోస్ట్ షేర్ చేయడంతో.. అలియా కల్కి 2898 ఏడీలో దీపికా పదుకునే పాత్రని రీప్లేస్ చేయబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్‌ వరల్డ్‌ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.

English Summary

Global star Prabhas is starring in the film "Kalki". Directed by Nag Ashwin, this film has achieved sensational success. Amitabh played the lead role and Deepika Padukone was made the heroine.