చచ్చేవరకు సల్మాన్ నన్ను వదిలిపెట్టడు: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్!


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి సల్మాన్ మాజీ ప్రియురాలు, నటి సోమీ అలీ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. కృష్ణజింకల వేట వివాదానికి సంబంధించి బిష్ణోయ్ కమ్యూనిటికీ క్షమాపణలు చెప్పాలని తాను స్వయంగా సల్మాన్ ఖాన్ కు సలహా ఇచ్చినట్లు సోమీ అలీ తెలిపారు. ఆ విషయంలో తాను సల్మాన్ ఖాన్ తో పాటు బిష్ణోయ్ సమాజంతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించానని.. కానీ ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సోమీ అలీ పేర్కొన్నారు.

Advertisement
అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ లో సగభాగం వారికేనట..!
Advertisement

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోమీ అలీ మాట్లాడుతూ.. " నేను సల్మాన్ ఖాన్ ప్రైవేట్ నంబర్ కు స్వయంగా మెసేజ్ చేశాను. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. వెంటనే బిష్ణోయ్ సమాజ్ ఆలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పండి. మీరు చేసిన తప్పుకు క్షమాపణ కోరితే అంతా సర్దుకుంటుందని చెప్పానని.. కానీ ఆయన నా మాటను అస్సలు పట్టించుకోలేదని సోమీ అలీ వివరించారు. అలాగే బిష్ణోయ్ కమ్యూనిటీకి కూడా తాను ఓ విజ్ఞప్తి చేశానని.. సల్మాన్ ఖాన్ ప్రాణాలు తీయడం వల్ల చనిపోయిన కృష్ణజింక తిరిగి రాదని.. సల్మాన్ ఖాన్ తరఫున తాను చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పినట్లు సోమీ అలీ వెల్లడించారు.

Advertisement

సల్మాన్ ఖాన్ నుంచి మీరెందుకు మూవ్-ఆన్ కాలేకపోతున్నారంటూ అడిగిన ప్రశ్నకు.. సోమీ అలీ తీవ్రంగా స్పందించారు. సల్మాన్ ఖాన్ తనను ప్రశాంతంగా జీవించనివ్వడం లేదని.. అదే అసలు సమస్య అంటూ పేర్కొన్నారు. ఇటీవల ఆయన గెలాక్సీ అపార్ట్మెంట్ బయట కాల్పులు జరిగినప్పుడు.. సల్మాన్ ఖాన్ దుబాయ్ వచ్చి నా సోదరి కలిశారని.. కానీ తనతో మాట్లాడలేదని సోమీ అలీ వెల్లడించారు. అనంతరం తన సోదరి కుమారుడు ప్రారంభించిన స్కూల్ ను రిబ్బన్ కట్ చేసి సల్మాన్ ప్రారంభించారని సోమీ అలీ తెలిపారు. నాతో ఏదో రకంగా కనక్ట్ అయ్యేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. తనను మానసికంగా వేధించడానికి, జీవితంలో ముందుకెళ్లకుండా చేయడానికి సల్మాన్ అవకాశాల కోసం చూస్తుంటారని సోమీ అలీ ఆరోపించారు.

Advertisement
రాజమౌళి తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతోనే..! ఎట్టకేలకు తెలిసిపోయింది..

ఈ వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తాను చనిపోయే వరకు సల్మాన్ ఖాన్ తనను వదలిపెట్టడు అంటూ సోమీ అలీ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ ప్రపంచంలోనే అతిపెద్ద పిసినారి అని కూడా ఆమె విమర్శించారు. 1990ల కాలంలో సల్మాన్ ఖాన్, సోమీ అలీల ప్రేమాయణం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత బ్రేకప్ కావడంతో సల్మాన్ ఖాన్ తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని సోమీ అలీ గతంలోనూ అనేక సార్లు ఆరోపించారు. కానీ సల్మాన్ మాత్రం ఈ ఆరోపణలపై ఎప్పుడూ స్పందించలేదు.

English Summary

Salman Khan Ex-Girl Friend Somy ali Makes Sensational Allegations, Stating she advised him to apologize to the Bishnoi Community and Accuses him of mental harassment.