కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్‌లో మరో భారీ మూవీ పడింది. ఓ సోషియో ఫాంటసీ చిత్రం ద్వారా తెరపై రాబోతోన్నాడు. ఇంతకుముందు ఊరి పేరు భైరవకోనలో నటించాడు గానీ ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ మిస్టికల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి కరికాల అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫిల్మ్.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది.

Advertisement

దీనికి దర్శకుడు మరెవరో కాదు.. యుగంధర్ ముని. ఇదివరకు శంభాల తీశాడు. గత ఏడాది డిసెంబర్ లో విడులైన ఈ మూవీ.. సూపర్ హిట్ అయింది. ఆది సాయికుమార్ కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దాదాపుగా అదే జానర్ ను ఎంచుకున్నాడు యుగంధర్ ముని. కరికాల పేరుతో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తోన్నాడు. సందీప్ కిషన్ ను ఓ వారియర్ గా చూపించబోతోన్నాడీ యంగ్ డైరెక్టర్.

Advertisement

ఈ మూవీ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ యుధుడి గెటప్ లో కనిపించాడు సందీప్ కిషన్. చేతిలో కత్తి పట్టుకుని, గుర్రంపై అడవిదారుల గుండా దూసుకెళ్తూ దర్శనం ఇచ్చాడు. ఆ గుర్రం పక్కనే జూలు విదిల్చిన ఓ సింహం కూడా పరుగెత్తుతుండటం ఈ పోస్టర్‌కు మరింత సీరియస్ లుక్ ను తీసుకొచ్చింది. ప్రాచీన కాలం నాటి యుద్ధ నేపథ్యం, ఫాంటసీ అంశాల కలయికగా ఈ సినిమా ఉండబోతుందని ఈ ఫస్ట్ లుక్ స్పష్టం చేస్తోంది.

వరల్డ్ కప్ కోసం టీమిండియా లెజెండ్ సెలెక్ట్ చేసిన మెరికలు- వీళ్లే ఉంటే దుమ్ము రేపుతారు
Advertisement

శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీలను కూడా మేకర్స్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్ట్ 1 వచ్చే ఏడాది జూలై 2న, పార్ట్ 2.. అదే ఏడాది అక్టోబర్ 28వ తేదీన విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

English Summary

Sundeep Kishan and Ugandhar Muni Team Up for Karikaala Promises Ancient Kingdoms, Mystical Powers and More. After creating curiosity with the project s concept poster, the makers have now officially unveiled the film s title and first look a breathtaking peek into its mythical universe.