ముద్దులు, రొమాన్స్‌తో రెచ్చిపోయిన యష్- కియారా.. టాక్సిక్ నుంచి తబాహీ రిలీజ్ !


కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "టాక్సిక్". ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అనే ట్యాగ్‌లైన్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించారు. రాఖీ భాయ్ పేరును ఇండియా వైడ్ గా రీ సౌండ్ వచ్చేలా చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆ సిరీస్ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నటీమణుల పాత్రల పోస్టర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. అలానే యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. అది అరాచకానికి కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉండి అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది.

Advertisement

ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఒక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. తబాహీ అంటూ సాగే ఈ పాట కన్నడతో పాటూ పలు భాషలలో రిలీజ్ చేశారు. ఈ పాటలో యశ్, కియారా అద్వానీ తమ బోల్డ్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. దాంతో ఈ సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. ఇక కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

Advertisement

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరొకవైపు ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి బోల్డ్ నటనను ఫ్యామిలీతో కలిసి చూడడం ఎలా అంటూ కొంతమంది మండిపడుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెంత బొల్డ్ గా పాటలు వస్తాయో అని..

English Summary

Kannada star hero Yash is starring in the most awaited pan India movie "Toxic". The film, which is coming with the tagline "A Fairy Tale for Grown Ups..," is being directed by Geethu Mohandas.