ఎన్టీఆర్ #GODOFWAR కి పోటీగా ధనుష్ తమిళ మురుగన్.. టాలీవుడ్ VS కోలీవుడ్ !!


గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాగా తారక్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ రీసెంట్ గానే వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను పంచుకున్నారు. ''శివుడి కుమారుడు.. పార్వతి దేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో'' అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Advertisement

ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో.. త్రిశూలం, కార్తికేయుడి శూలం, నంది కొమ్ములు, మధ్యలో ఓ డీఎన్ఏ లాంటి ఆకారంతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. బ్యాగ్రౌండ్ లో ఆలయాలు, రాజ ప్రాసాదాలు, యుద్ధ వాతావరణం కనిపిస్తున్నాయి. అలానే సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రంలోని ''న జానామి శబ్దం న జానామి చార్థం|| న జానామి పద్యాం న జానామి గద్యామ్ || చిదేకా షడాస్య హృది ద్యోతతే మే|| ముఖాన్నిఃసరన్తే గిరశ్చాపి చిత్రమ్ ||'' అనే శ్లోకం కూడా ఉంది. ఈ శ్లోకానికి ''నాకు శబ్దము తెలియదు.. అర్థము తెలియదు.. పద్యము తెలియదు.. గద్యము తెలియదు.. ఆరు ముఖముల గల రూపము నా మనస్సులో ప్రకాశిస్తోంది. నా ముఖము నుంచి మాటలు వెలువడుతున్నాయి. ఇదంతా చిత్రంగా ఉంది'' అర్థం.

Advertisement

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన 'లార్డ్ మురుగన్' పుస్తకం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ పోస్టర్‌లో కనిపించిన "Born in the North" అనే ట్యాగ్‌లైన్ ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడులో వివాదానికి కారణమైంది. సీమాన్ లాంటి రాజకీయ నాయకులు కూడా 'తారక్ - త్రివిక్రమ్' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఏకంగా తమిళంలో కూడా మురుగన్ కథతో సినిమా రాబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ధనుష్ - వెట్రిమారన్ కాంబోలో మూవీ..

కాగా హీరో ధనుష్ - డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో ఇప్పటికే పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై, అసురన్ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వీరి కాంబోలో "తమిళ్ మురుగన్" అనే మూవీని ప్రకటించారు. మూవీ టైటిల్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

''ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు, నాయకుడు.. తమిళ్ మురుగన్ అంటూ ధనుష్ పోస్ట్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలో యుద్ధ భూమిలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక ఏనుగుపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. వండర్‌బార్ ఫిలింస్, ప్రొడక్షన్ మైల్స్ టు గో బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Advertisement

దీంతో కావాలనే ఈ సినిమా పట్టాలెక్కిస్తున్నారని తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలికి పోటీగా పొన్నియన్ సెల్వం తీసి చేతులు కాల్చుకున్నట్టే ఇప్పుడు కూడా జరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఎంతకి దారి తీస్తుందో అని.

English Summary

Global star and young tiger NTR is making waves with a series of films. He has already scored a solid hit with the film Devara this year. It is known that he is currently working on a film under the direction of Prashanth Neel.