ఓటీటీని షేక్ చేస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ఒక్కరే చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!

ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఆహా వంటి ఓటీటీ వేదికలు ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం కూడా ఓటీటీలో పలు ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Advertisement

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని 'సూపర్ సుబ్బు', 'మర్మదేశం', 'ఇసకపట్నం' వంటి వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్రారంభించాయి. అలాగే థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' కూడా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే వీటన్నింటి మధ్య గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హిందీ సినిమా మాత్రం అనూహ్యంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, భయపెట్టే విజువల్స్ ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక బెస్ట్ వాచ్‌గా నిలుస్తోంది.

Advertisement

కథ ఏమిటంటే..

ఈ సినిమా కథ 1800ల కాలంలో ప్రారంభమవుతుంది. అధికారం, అహంకారం, క్రూరత్వంతో ప్రజలను హింసించిన ఓ రాజు చేసిన పాపాల వల్ల ఒక భయంకరమైన దుష్టశక్తి ఉద్భవిస్తుంది. మరణించిన తర్వాత కూడా ఆ శాపం అంతం కాకుండా రాజ కుటుంబాన్ని తరతరాల పాటు వెంటాడుతూ ఉంటుంది. ఆ రాజవంశానికి వారసత్వంగా వస్తున్న విలువైన నగల్లోనే ఆ శాపం దాగి ఉంటుంది. ఆ నగలను ఎవరూ తాకనంత వరకు ఆ దుష్టశక్తి నిద్రాణంగానే ఉంటుంది. కానీ ఎవరైనా వాటిని ధరించిన క్షణం నుంచి భయానక సంఘటనలు ప్రారంభమవుతాయి. ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అసలు ఆ నగల్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది? చివరికి శాపానికి ముగింపు దొరికిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Advertisement

నటీనటుల ప్రదర్శన..

ఈ చిత్రానికి నిర్భయ్ జారివాలా, జయేష్ వృషీరాజ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు మనోజ్ జోషి తన అనుభవంతో కీలక పాత్రలో మెప్పించగా, భూషణ్ ప్రధాన్, తృప్తి సాహు, అర్పిత రంకా, నీతూ పాండే, సురేందర్ శర్మ, కీర్తికా గుప్తా, స్పందన పల్లి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ సినిమా పేరు 'తవ్వై' (Tavvai). ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English Summary

There is no need to mention how much the OTT trend is going on these days. With a movie released in theaters coming to OTT within 15 to 20 days, audiences are more inclined to watch movies at home than going to theaters.