విజయ్ వీడ్కోలు సినిమాకు బిగ్ షాక్.. విడుదలైన రెండో రోజే..!

తమిళనాడు ముఖ్యమంత్రి , కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన వీడ్కోలు సినిమా 'జననాయగన్' అనేక అడ్డంకులు, కష్టాల తర్వాత విడుదలై బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మొదటి రోజు భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమా.. రెండో రోజుకు వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. శుక్రవారం నాడు వసూళ్లు కాస్త నెమ్మదించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా రెండో రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటుకుంది.

Advertisement
విజయ్ చివరి సినిమా.. థియేటర్‌లో త్రిష రచ్చ! (వీడియో)
Advertisement

రెండో రోజు 50 శాతం పడిపోయిన కలెక్షన్లు
శాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. 'జననాయగన్' సినిమా రెండో రోజు ఇండియాలో దాదాపు రూ.21.15 కోట్ల నికర వసూళ్లను సాధించింది. మొదటి రోజు ఈ సినిమా రూ.42.70 కోట్లు రాబట్టగా.. రెండో రోజు కలెక్షన్లలో దాదాపు 50.5 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో రెండ్రోజుల్లో భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొత్తం నికర వసూళ్లు రూ.63.85 కోట్లకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. విదేశాల నుంచి రెండో రోజు రూ.10 కోట్లు రాబట్టడంతో.. మొత్త ఓవర్సీస్ కలెక్షన్లు రూ.37.50 కోట్లకు చేరుకున్నాయి. భారత్ లోని గ్రాస్, ఓవర్ససీ వసూళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.112.50 కోట్ల గ్రాస్ మార్కును దాటింది.

Advertisement

అంతా తమిళ్ వెర్షన్ నుంచే..
భాషల వారీగా చూస్తే 'జననాయగన్' తమిళ వెర్షన్ కు అత్యధిక వసూళ్లు వచ్చాయి. శుక్రవారం తమిళంలో రూ.17.95 కోట్లు రాగా.. హిందీ వెర్షన్ రూ.1.85 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.1.35 కోట్ల నికర వసూళ్లను సాధించాయి. ప్రాంతాల వారీగా చూస్తే రెండో రోజు తమిళనాడు నుంచిరూ.15 కోట్లు, కర్ణాటక నుంచి రూ.3.22 కోట్లు, తెలుగు రాష్ట్రాల నుంచి రూ.2 కోట్లు, కేరళ నుంచి రూ.2 కోట్లు వసూలు కాగా.. మిగిలిన రాష్ట్రాల నుంచి రూ.2.50 కోట్లు వచ్చాయి.

Advertisement
విజయ్ వీడ్కోలు సినిమా..ఇలా చేశావేంటన్నా..!

'జననాయగన్' సినిమా మొత్తం థియేటర్ ఆక్యుపెన్సీ 44.33 శాతంగా నమోదైంది. ఉదయం షోలలో 32.77 శాతంతో ప్రారంభమై, రాత్రి షోల సమయానికి గరిష్టంగా 60.31 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.

English Summary

Thalapathy Vijay Jana Nayagan Movie saw a 50% drop on Day 2 at the box office, fetching Rs.21.15 Cr net in India. Overall worldwide collection crosses Rs.100 Cr mark.