నీ సినిమాకు టికెట్ ముక్క కూడా దొరకట్లే అన్నా.. క్రేజ్ కా బాప్..!


కొన్ని సినిమాలకు టాక్ తో పని లేదు. హిట్టా..? ఫట్టా..? సంబంధం లేదు. ఒక్కసారైనా బిగ్ స్క్రీన్ పై ఆ సినిమాను కళ్లారా చూడాలని కోరుకుంటారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరాన్, క్రిస్టోఫర్ నోలన్ అలాగే పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఇక ఈ దర్శకుల సినిమాలు హిట్టు అయితే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్.. అలాంటి అద్భుతమే సృష్టించాడు. నోలన్ దర్శకత్వంలో జూలై 17న విడుదలైన ది ఒడిస్సీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది.

Advertisement
ఓటీటీలోకి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నోలన్ టేకింగ్, దర్శకత్వ ప్రతిభ, నటీనటుల యాక్టింగ్, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విభాగం ఓ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మ్యాట్ డామన్, యన్నా హాత్ వే, టామ్ హాలాండ్, జెందయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపితా న్యోంగో, చార్లిజ్ థెరాన్ తదితర స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి బుర్రపాడు చేసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..!
Advertisement

భారత్ లోనూ కనివినీ ఎరుగని రీతిలో ఈ మూవీ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2,500 స్క్రీన్స్ లో రిలీజైన ది ఒడిస్సీ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ది ఒడిస్సీ మూవీకి ఓపెనింగ్స్ చూస్తే రూ. 20.76 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక గతంలో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ చిత్రాన్ని కూడా కలెక్షన్స్ లో ఈ మూవీ బీట్ చేసింది. ఇప్పటికే అద్భుతమైన మౌత్ టాక్ రావడంతోపాటు పాజిటివ్ రివ్యూలు కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. దాంతో ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి కలెక్షన్ల పరంగా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

ఈ మూవీ అర్బన్, మెట్రో పాలిటన్ నగరాల్లో దూసుకెళ్తోంది. ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణెలో రికార్డు స్థాయిలో హౌజ్ ఫుల్ షోలు నడుస్తున్నాయి. ఈ నగరాల్లోని థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటలకే హౌజ్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫస్ట్ 3 రోజుల్లో రూ. 18 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. అలాగే ఓపెనింగ్స్ రూ. 18 కోట్ల వరకు అందుకోవడం విశేషం. ఇక ఒడిస్సీ మూవీని 250 మిలియన్ బడ్జెట్​ పెట్టి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.