టాక్సిక్ మూవీ స్టోరీ రివీల్ చేసిన హీరో యష్.. హిట్టు గ్యారంటీ !!


కన్నడ స్టార్ హీరో యష్ KGF సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించారు. రాఖీ భాయ్ పేరును ఇండియా వైడ్ గా రీ సౌండ్ వచ్చేలా చేశారు. ఈ క్రమంలోనే ఆ సిరీస్ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "టాక్సిక్". ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అనే ట్యాగ్‌లైన్ తో ఈ మూవీ రాబోతుంది.

Advertisement

ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement

ఇప్పటికే నటీమణుల పాత్రల పోస్టర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. అలానే యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. అది అరాచకానికి కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉండి అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఇక ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఒక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. తబాహీ అంటూ సాగే ఈ పాట కన్నడతో పాటూ పలు భాషలలో రిలీజ్ చేశారు. ఈ పాటలో యశ్, కియారా అద్వానీ తమ బోల్డ్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. దాంతో ఈ సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో నిలిచింది.

Advertisement

ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. మరొవైపు ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి బోల్డ్ నటనను ఫ్యామిలీతో కలిసి చూడడం ఎలా అంటూ కొంతమంది మండిపడుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించినా.. తాజాగా యష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా కథకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు.

యష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 'టాక్సిక్' కథ 1947 నుంచి 1961 మధ్యకాలంలో గోవా (Goa)లో పోర్చుగీస్ పాలన కొనసాగుతున్న సమయంలో జరుగుతుంది. అప్పటి గోవాలో వాణిజ్యం, నౌకాశ్రయాలు (పోర్టులు), అంతర్జాతీయ వ్యాపారం, శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రిటీ క్రైమ్ డ్రామాగా రూపొందుతోంది. అధికారం కోసం జరిగే పోరాటాలు, అత్యాశ, గ్యాంగ్ వార్స్, అక్రమ వ్యాపారాలు, టామీ గన్స్‌తో సాగే హింసాత్మక ఘర్షణలు, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అప్పటి అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని అత్యంత స్టైలిష్‌గా, రియలిస్టిక్‌గా తెరపై ఆవిష్కరించనున్నారని సమాచారం.

Advertisement

అయితే 'టాక్సిక్' కేవలం యాక్షన్‌కే పరిమితం కాదని యశ్ స్పష్టం చేశారు. కథలో బలమైన భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో పాటు, అన్నాచెల్లెళ్ల అనుబంధం, తండ్రి-కొడుకు మధ్య ప్రతీకారం చుట్టూ సాగే భావోద్వేగ కథనం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, ఫ్యామిలీ బాండింగ్, ప్రతీకారం వంటి అంశాలు ఈ మూవీలో ఉండనున్నాయి.

English Summary

Kannada star hero Yash is starring in the most awaited pan India movie "Toxic". The film, which is coming with the tagline "A Fairy Tale for Grown Ups..," is being directed by Geethu Mohandas.