వారణాసి నుంచి మహేష్ రాముడి గెటప్ లుక్ లీక్.. నెట్టింట ఫుల్ ట్రెండింగ్ !!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

Advertisement

రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన ఒక లుక్ లీక్ అయిందంటూ ఒక ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

పిక్ లీక్..

కాగా లీకైన ఫోటోలో మహేశ్ బాబు 'శ్రీరాముడి' గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌లో మహేష్ బాబు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారంటూ అభిమానులు ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటో నిజంగానే షూటింగ్ స్పాట్ నుండి లీకైన ఒరిజినల్ ఫొటోనా? లేక టెక్నాలజీని ఉపయోగించి అభిమానులు ఎవరైనా క్రియేట్ చేసిన ఏఐ (Al Generation) చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

ఇక ఇప్పటికే ఈ మూవీలో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుందని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాముడికి - కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం హైలైట్ గా నిలుస్తుందని తెలిపారు. టైటిల్ టీజర్ లో కుంభ కర్ణుడు, రాముడు కనిపించారు కదా. ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా.. అది అద్భుతంగా ఉంటుంది'' అని తెలిపారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరోవైపు ఈ మూవీలో మహేష్ చిన్ననాటి పాత్రలో భార్గవ్ రామ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ముద్దులొలికే ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. భార్గవ్ బాలనటుడిగా తెరంగేట్రం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌కు రాజమౌళికి, మహేష్ కు ఉన్న అనుబంధాల కారణంగా ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా ఇందులో భాగమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

English Summary

"Varanasi" is the movie being made in the combination of Superstar Mahesh Babu and director Rajamouli. As the most prestigious film in Tollywood, Mahesh Babu is producing this movie with the biggest budget in his career.