ఇంట్లో ఆ ముగ్గురి పోరు తట్టుకోలేకపోతున్నా: వరుణ్ తేజ్

టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరి వివాహ బంధం వెనుక ఉన్న ఏడేళ్ల ప్రేమ ప్రయాణం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ కీలక విషయాలను వెల్లడించాడు. తమ పరిచయం నుంచి పెళ్లి పీటల వరకు సాగిన ప్రయాణం, ఇంట్లో వీరిద్దరి మధ్య ఉండే సరదా వాతావరణం గురించి వరుణ్ తేజ్ మాట్లాడాడు.

Advertisement
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదే..
Advertisement

తమ తొలి పరిచయం కేవలం ఓ మంచి స్నేహంతో మాత్రమే ప్రారంభమైందని.. అప్పట్లో ఎలాంటి ప్రేమ భావాలు లేవని వరుణ్ తేజ్ వెల్లడించాడు. తనకు సరదాగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టమని.. లావణ్యలో ఆ లక్షణమే నచ్చిందని తెలిపాడు. తాను చాలా సైలెంట్‌గా ఉంటానని.. కానీ లావణ్య మాత్రం ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. కాలక్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలవడం వల్ల ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని చెప్పాడు.

ఏడేళ్ల రిలేషన్ షిప్.. ఆపై పెళ్లి
ప్రేమలో పడిన అనంతరం ఐదేళ్ల పాటు ఒకరి అభిప్రాయాలను, అలవాట్లను పూర్తిగా అర్థం చేసుకునేందుకు సమయం తీసుకున్నామని వరుణ్ తేజ్ స్పష్టం చేశాడు. ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని మరో రెండేళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టామన్నారు. అలా దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాతం ఇద్దరం ఒక్కటయ్యామని వరుణ్ తేజ్ వివరించాడు.

Advertisement
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ హిట్టు కొట్టేశాడు భయ్యా..!

ఇంట్లో భార్య, అమ్మ, చెల్లెలి రచ్చ
ఇంట్లో తన పరిస్థితిపై వరుణ్ తేజ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. లావణ్య తన తల్లి, చెల్లెలు నిహారికతో చాలా త్వరగా కలిసిపోయిందని చెప్పాడు. ఇంట్లో అమ్మ, చెల్లి, లావణ్య ముగ్గురూ కలిసి కూర్చుంటే అసలు మాటల ప్రవాహం ఆగదని పేర్కొన్నాడు. నేనేమో తక్కువ మాట్లాడే వ్యక్తినని.. వారి ముగ్గురి రచ్చ మధ్య నా పరిస్థితి దారుణంగా ఉంటుందని.. అందుకే కొన్నిసార్లు తట్టుకోలేక చెవులు మూసుకుని అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోతుంటానని వరణ్ తేజ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

English Summary

Actor Varun Tej opened up about his seven-year love story with Lavanya Tripathi and shared humorous insights into their family life, saying he struggles to keep up when his wife, mother, and sister Niharika get together and chat nonstop.