Korean Kanakaraju First Review: దేశంలోనే తొలిసారి అలాంటి ప్రయత్నం..!

టాలీవుడ్ లో హిట్ కోసం పరితపిస్తున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గాంఢీవధారి అర్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2022 లో వచ్చిన ఎఫ్ 3 సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో వరుణ్ తేజ్ కు గత మూడేళ్లుగా సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దాంతో ఈ సారి కసిగా చేసిన ప్రాజెక్ట్ 'కొరియన్ కనకరాజు' ఈ మూవీ ఆగస్టు 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హార్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే స్పష్టం అవుతోంది.

Advertisement

ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌ టైన్‌ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజైన టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్ ను ఏర్పరచింది. వరుణ్ తేజ్ కు ఈ మూవీ పక్కా కమ్ బ్యాక్ అని తెలుస్తోంది. ఇలాంటి విభిన్న తరహా కథలు చేయాలంటే వరుణ్ తేజ్ తర్వాతే ఎవరైనా అని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక 'కొరియన్ కనకరాజు' సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీని ప్రివ్యూ షో గా ఇటీవల రామానాయుడు స్టూడియోస్ లోని థియేటర్ లో ప్రదర్శించారు. ఈ షో నుంచి వచ్చిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

Advertisement

కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్ చాలా సరదాగా ఎంటర్ టైన్ మెంట్ వే లో సాగిపోతుందట. వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయని టాక్ వినిపిస్తోంది. అలాగే కొరియన్ అమ్మాయితో లవ్ ట్రాక్.. ఇక ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ కు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంతో పాటు వరుణ్ తేజ్ నటన ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందని తెలుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కావాలంటే ఆగస్టు 7 వరకు ఆగాల్సిందే..