ఆ స్టార్ హీరోయిన్ నేను నా బైక్ మీద తిరిగేవాళ్లం - వేణు స్వామి.


ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. సాధారణ పండితులు లాగా కాకుండా సంచలన స్టేట్ మెంట్స్ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమంత- నాగ చైతన్య విషయం మొదలు.. ప్రభాస్ హిట్స్ గురించి వరకు టాలీవుడ్ ప్రముఖులపై ఆయన చేసిన కామెంట్స్ ఎంత రచ్చకు తెర లేపాయో అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయాల గురించి సైతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని.. జగన్ కి మహర్దశ పడుతుందని అన్నారు. కానీ అది రివర్స్ అవ్వడంతో కూటమి కార్యకర్తలు ఆయనను గట్టిగా ట్రోల్ చేశారు. కాగా ఇటీవల కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన.. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు.. పలు ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించి మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

Advertisement

వేణుస్వామి ఏమన్నారంటే..

మెదక్ జిల్లా గోమారంలో తొమ్మిదో తరగతి వరకు చదివానని.. చిన్నతనం నుంచే పూజలు చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తన అన్న రఘునాథ చారి వద్ద ఉంటూనే పౌరోహిత్యాన్ని కొనసాగించానని.. హైదరాబాద్‌కు వచ్చి టెన్త్ , ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్టు వివరించారు. డిగ్రీలో ఏబీవీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేసినట్టు తెలిపారు. తన తండ్రికి గుడిలో దక్కిన గౌరవం చూసి.. జనాల నుంచి గౌరవం పొందాలనే కోరిక చిన్నప్పుడే కలిగినట్లు స్పష్టం చేశారు.

Advertisement

2004లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి పరిచయంతో జ్యోతిష్య రంగంలోకి మరింత లోతుగా ప్రవేశించానని అన్నారు. అప్పటికే జ్యోతిష్యం తెలిసినా, దాన్ని వృత్తిగా స్వీకరించి.. మరింత లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారన్నారు. సాధారణ పూజలకు భిన్నంగా, త్వరితగతిన ఫలితాలు ఇచ్చే వామాచార మార్గాన్ని అనుసరించడానికి గల కారణాలను సైతం ఓపెన్ అయ్యారు. వామాచారం, దశమహావిద్యలు చాలా కఠినమైన సమస్యలకు పరిష్కారాలు చూపుతాయని.. సాధారణ జీవితం కోటీశ్వరుడిగా మారడానికి సహాయపడతాయని చెప్పారు.

అంతే కాకుండా దివంగత నటి దివ్యభారతితో కలిసి తన టూవీలర్‌పై రోడ్లపై తిరిగినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నటీనటులు టీ తాగడానికి కూడా బయటకు వచ్చే వాతావరణం ఉండేదని అన్నారు. పరిటాల రవి ఇంట్లో కూడా పూజలు చేసినట్టు వ్యాఖ్యానించారు. తన లక్ష్యం కింగ్ అవ్వడం కాదని, కింగ్‌మేకర్‌గా ఉండటమే అంటూ తన మనసులో మాటని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి.

English Summary

Renowned astrologer Venuswamy is well-known to the people of the Telugu states. Unlike ordinary scholars, he is constantly in the news for making sensational statements.