లేడీస్ ఎంట్రీ ఇచ్చారోచ్.. టాక్సిక్ నుంచి సర్ ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్ !!

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "టాక్సిక్". ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అనే ట్యాగ్‌లైన్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించారు. రాఖీ భాయ్ పేరును ఇండియా వైడ్ గా రీ సౌండ్ వచ్చేలా చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆ సిరీస్ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నటీమణుల పాత్రల పోస్టర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. అలానే యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. అది అరాచకానికి కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉండి అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది.

Advertisement

తాజాగా మేకర్స్ 'లేడీస్ & లేడీస్' పేరుతో ఓ పవర్‌ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలోనే "పిల్లలు... దూరంగా ఉండండి. తల్లిదండ్రులు... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి" అనే డిస్క్లైమర్‌తో సినిమాకు ఉన్న బోల్డ్ టోన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఒక్కో ఫ్రేమ్‌లో తమ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

Advertisement

నయనతార అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఫియర్స్ లుక్‌లో కనిపించగా.. కియారా అద్వానీ విభిన్నమైన, మ్యాగ్నెటిక్ ఎనర్జీతో మెప్పించింది. తారా సుతారియా చలాకీగా, రుక్మిణి వసంత్ తీవ్రమైన ఇంటెన్సిటీతో, హ్యూమా ఖురేషి నెరజాణ తరహా గ్లింప్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

English Summary

Kannada star hero Yash is starring in the most awaited pan India movie "Toxic". The film, which is coming with the tagline "A Fairy Tale for Grown Ups..," is being directed by Geethu Mohandas.