పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్.. కానీ వద్దన్నా - యూట్యూబ్ ఫేమ్ నాగదుర్గ

యూట్యూబ్ ఫేమ్ నాగదుర్గ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. యూట్యూబ్‌లో జానపద గీతాలు, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. "దారిపొంటత్తుండు", "నా పేరు ఎల్లమ్మ", "ఎర్ర రుమాల్", "కాపోళ ఇంటికాడ" వంటి ఫోక్ సాంగ్స్‌తో కోట్లాది వ్యూస్ సాధించింది. ఇప్పటికే ఫోక్ సింగర్‌గా, డాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా హీరోయిన్‌గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన నాగదుర్గ ఇప్పుడు అదే క్రేజ్‌ను సినిమాల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో 'కలివనం' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నాగదుర్గ.. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళ చిత్రసీమలో కూడా అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న 'లవ్ ఓ లవ్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె కెరీర్‌లో అసలైన బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఇప్పుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం'అనే భావిస్తున్నారు.

Advertisement

'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా ఎంపికైంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో దొండపాటి వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నాగదుర్గ 'శ్రీలత' అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆమె లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'ఇడుపు కాయితం' అనే విభిన్నమైన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

అయితే నాగదుర్గకు గతంలోనే పలు మంచి సినిమా అవకాశాలు వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "హీరోయిన్‌గా నటించకముందే నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయని ఓపెన్ అయ్యింది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సాయి పల్లవి పాత్రకు సహచరిగా నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే 'అశోకవనంలో అర్జున కళ్యాణం', పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' చిత్రంలో సిస్టర్ పాత్ర వచ్చాయని తెలిపింది.

Advertisement

అంతే కాకుండా కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా అవకాశాలు వచ్చాయని.. నీ ఆ సమయంలో నా పూర్తి దృష్టి డాన్స్ పైనే ఉండేదని క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో డాక్టరేట్ చేయాలనేది తన లక్ష్యమని స్పష్టం చేసింది. అందుకే ఆ అవకాశాలన్నింటినీ వదులుకున్నానని.. ఇప్పుడు మంచి కథ, మంచి పాత్ర దొరికిందని భావించి సినిమాల్లోకి అడుగుపెట్టాను" అని చెప్పింది. దీంతో ఫోక్ సింగర్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం.. హీరోయిన్‌గా కొత్త అధ్యాయాన్ని ఇవ్వాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

English Summary

YouTube fame Nagadurga.. She needs no introduction in the two Telugu states. This Telangana girl has earned millions of fans on YouTube with her folk songs and dances.