వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. 40 ఏళ్లు దాటితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వయసు నుంచి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తప్పనిసరి. ఆహారంతో పాటుగా జీవనశైలిలోనూ అవ సరమైన మార్పులు చేసుకోవాలి. శరీరంలో వచ్చే అనేక హార్మోన్ల మార్పులు కొత్త ఆరోగ్య సమస్యల కు కారణాలుగా నిలుస్తాయి. సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. దీంతో.. 40 వయసు దాటిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు.
వయసు పెరిగే కొద్దీ శరీరం బలం కోల్పోతూ ఉంటుంది. 40 ఏళ్ల తరువాత శరీరంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో.. కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు.. అదే సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా డైలీ డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వయసుకు చేరిన వారికి ఎక్కువగా ఆకు కూరలు తీసుకోవటం మంచింది. వీటి నుంచి ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీని ద్వారా హిమోగ్లోబిన్, RBC, WBC కౌంట్‌ని పెంచేందుకు తోడ్పాటు అందిస్తాయి. అదే విధ:గా ఉడికించిన గుడ్డు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గుడ్డులో ఉండే ప్రొటీన్ కంటెంట్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సమృద్ధిగా అందుతుంది. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
గ్రీన్ టీ ఎవరికి మంచిది, ఏ సమయంలో తాగాలి..!?
యాంటీ ఆక్సిడెంట్లు ఇవ్వటంతో పాటుగా క్యానర్సర్ కు కారణమయ్యే ప్రీ రాడికల్స్ ను అడ్డుకునే విధంగా సహకరించే డార్క్ చాక్లెట్, బెర్రీలను తీసుకోవటం మంచిది. శరీరానికి శక్తిని అందిస్తూనే సులభంగా జీర్ణం అయ్యే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం. అదే విధంగా జీర్ణక్రియను మెరుగుపర్చే పెరుగు, మజ్జిగ వంటి ప్రో బయోటిక్ పదార్ధాలు తీసుకోవాలి. వీటి ద్వారా కాల్షియం సైతం శరీరానికి అందుతుంది. పనిభారం, ఇంటి బాధ్యతల వల్ల మగవాళ్లు తరచూ టెన్షన్ పడాల్సి వస్తుంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది అధిక రక్తపోటు, ఊబకాయానికి దారితీస్తుంది. వీటి నియంత్రణ కోసం యోగా, వాకింగ్ వంటివి రెగ్యులర్ గా చేయటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగానూ 40 దాటిన తరువాత అవసరమైన పరీక్షలను నిర్ణీత వ్యవధిలో చేయించుకోవటం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతున్నారు.నిపుణుల సూచనలు