బార్లీ నీళ్లు. ప్రాచీన సంప్రదాయాలలో దీని మూలాలు ఉన్నాయి. ఈ నీళ్లను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో అనేక పోషకాలు, ఔషధ విలువలు ఉంటాయి. ఇవి పలు వ్యాధులను నయం చేస్తాయి. గుప్పెడు బార్లీ గింజలను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా చేస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది. దీంతో పాటుగా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
బార్లీలో విటమిన్ బి-కాంప్లెక్స్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, జింక్, రాగి, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, పీచుపదార్థం, బీటా-గ్లూకాన్లతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బార్లీ నీరు మీ శరీరం నుండి అన్ని విషపదార్థాలను బయటకు పంపడానికి, రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర చడానికి సహాయపడుతుంది. బార్లీ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అతిగా ఆహారం తింటున్ నవారు బార్లీ నీళ్లను రోజూ తాగుతుంటే ఫలితం ఉంటుంది. బార్లీ గింజల్లో ఉండే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.
ఉదయం నాలుగు గింజలు తీసుకోండి- బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్.. గుండె సేఫ్..!!
బార్లీ రెగ్యులర్ గా తీసుకోవటం వలన బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బార్లీ నీటిలో అద్భుతమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. బార్లీ గింజల నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుని చెబుతున్నారు. ఇక, బార్లీ గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అనేక రకాల బి విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బార్లీ నీళ్లు సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా పనిచేస్తాయి. దీని ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. ఇలా బార్లీ నీటితో అనేక లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.నిపుణుల సూచనలు