రోజూ రాత్రిళ్లు చపాతీలు తింటున్నారా..!?

ఈ మధ్య కాలంలో అన్నంకు బదులుగా ఎక్కువ మంది చపాతీ ఆహారంగా తీసుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీ తినేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు లేదా మూడు చపాతీలతో భోజనం ముగించేస్తున్నారు. ఇదే సమయంలో ఇలా నిత్యం చపాతీలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహాలు పెరుగుతున్నాయి. చపాతీలు ఇలా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయా. ఇలాంటి అంశాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

Advertisement

మారుతున్న కాలంతో పాటుగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చాలా మంది అన్నం స్థానం లో ఎక్కువగా చపాతీలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరంగా గుర్తించారు. బరువు తగ్గడానికీ చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను ఆహారంగా తీసుకోవటం ద్వారా తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు. జీర్ణ సంబంధిత సమస్యలు..మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ ఉన్న వారు నిపుణుల సలహా మేరకు చపాతీల ను తోసుకోవాలి. చపాతీల్లో విటమిన్ బి, ఇ విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్‌, కాపర్‌, అయొడిన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, పొటాషియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Advertisement

పరిమితి అవసరం.. నిపుణుల సూచనలు

కాగా, చపాతీల్లో ఉండే ఐరన్ హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని చెబుతున్నారు. దీని ద్వారా ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్‌ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతాయి. కాగా, చపాతీ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. గోధుమపిండికి రాగి, సోయాబీన్‌, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్‌ పిండిని వాడుకోవటం మంచిది. చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదు. చపాతిలో.. లో గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలోని చక్కెరల నిల్వలను అదుపులో ఉంచుతుంది. రాత్రి సమయంలో రక్తంలో చక్కెర శాతం పెరగకుండా దోహదం చేస్తుంది. చపాతీ తినటం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

English Summary

Chapati earlier in the day gives your body more time to use those carbohydrates for energy rather than storing them as fat