ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన కోడిగుడ్లను తింటున్నారా..!?


కోడిగుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎన్నో పోషకాలు అందిస్తుంది. కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఈ గుడ్లు ఆరోగ్యానికి కావాల్సిన శక్తి అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో వాటికి సాటేది లేదు. అయితే, చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తారు. పదార్ధాలను ఫ్రిజ్ లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గుడ్ల విషయంలోనూ పలువురిలో అపోహలు ఉన్నాయి. ఫ్రిజ్ లో గుడ్లు ఎన్ని రోజుల ఉంచవచ్చు. అయితే, ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు తినవచ్చా లేదా అనే అంశం పైనా నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

Advertisement

రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్లు తోడ్పాటు అందిస్తాయి. సాధారణంగా ప్రతీ ఇంటా గుడ్లను ఫ్రిజ్ లో వినియోగించటం కనిపిస్తుంది. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు నిరూపించాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల గుడ్ల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధ్యమై నంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండటం మంచిది. తక్కువ సమయం ఫ్రిజ్ లో ఉంచితే మంచిది అని సూచిస్తున్నారు.

Advertisement
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా - ఆరోగ్యానికి మంచిదేనా..!?

నిపుణుల సూచనలు

గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదు. నిల్వ చేసినా ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి స్టోరేజ్ చేయాలి. ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‎లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్‎లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి. అప్పటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన వరకు గుడ్లను తెచ్చుకొని వినియోగించటం ద్వారా పోషకాలు ఉంటాయని.. ఫ్రెష్ గుడ్లు వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు.

English Summary

Eggs can last a few weeks in the refrigerator. But their quality may start to decline over time, resulting in changes in taste and texture