ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా - ఆరోగ్యానికి మంచిదేనా..!?


ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ప్రెషర్‌ కుక్కర్‌లో వంట చేస్తున్నారు. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు.ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. ఎలక్ట్రిక్ కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల సాంప్రదాయిక పద్ధతిలో వంటకు ఖర్చయ్యే సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి. అయితే, ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా.. నష్టం చేస్తుందా.. ఈ సందేహం అనేక మందిలో ఉంది. ఇందులో అనుకూలతలతో పాటుగా ప్రతికూలతలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం వండటం వలన ప్రయోజనాలతో పాటుగా నష్టాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగం పెరిగిపోతోంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఎక్కువ సేపు అన్నం ఉడికించడం వల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు (విటమిన్ B, C వంటి) కొంత మేర నష్టపోవచ్చు. వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
ఏపీ మీదుగా బెంగళూరుకు బుల్లెట్ రైలు, ఎలైన్‌మెంట్‌ మార్పు - ఈ ప్రాంతాలకు వరం..!!

నిపుణుల సూచనలు

కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి ప‌దార్థం తొల‌గిపోవ‌డంవ‌ల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. కాగా, నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు కారకాలుగా మారే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. ఇక.. మట్టిపాత్రలు, లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించి తీసుకోవడం మేలు. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి.

English Summary

Electric rice cooker cooking is safe, healthy, and convenient. Learn how steaming and water absorption help retain nutrients