రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఎన్నో బెనిఫిట్స్ - కొలెస్ట్రాల్, బీపీకి చెక్..!!

అల్లం. ప్రతీ ఇంటా కనిపిస్తుంది. వంటలోనే కాదు.. ఆరోగ్య పరంగానూ ప్రయోజనాలు అందిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పలు అనారోగ్య సమస్యలకు అల్లంతో చెక్‌ పెట్టొచ్చు. చిన్న సమస్యలతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధుల అదుపు లోనూ అల్లం ఉపకరిస్తుంది. అయితే, అల్లం నిత్యం వాడవచ్చా.. ఎంత మోతాదులో వాడాలి వంటి సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

Advertisement

అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లంలో అనేక జీవక్రియశీల సమ్మేళనాలతో పాటుగా జింజెరోల్, షాగావోల్ వంటికి నిక్షిప్తం అయి ఉంటాయి. వీటి లో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లం తినడం వల్ల రక్తనాళాలు సాధారణ స్థితికి వస్తాయి. తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటం సహా హైబీపీ సమస్యను తగ్గిస్తుంది. అదే విధంగా అల్లం వినియోగం ద్వారా జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి నియంత్రణలోకి వస్తాయని చెబుతున్నారు. కాగా, ఇక ఆకలిని పెంచడంలో అల్లం పని చేస్తుంది. అల్లంలో వాపు నిరోధక గుణాలు ఉంటాయని చెబుతున్నారు. శరీరంలోని ఏ భాగంలోనైనా వాపును తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది.

Advertisement

రోజు తీసుకోవటం ద్వారా ప్రయోజనాలు

కీళ్లు, కండరాలలో నొప్పి ఉంటే.. అల్లం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అల్లంను క్రమం తప్పకుండా బరువు సైతం అదుపులోనే ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలోనూ అల్లం మేలు చేస్తుంది. అదే విధంగా చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ తో పాటుగా బీపీ నియంత్రణకు సహకరిస్తుంది. డయాబెటిక్ బాధితులకు బ్లడ్ లో షుగర్ నియంత్రణ కు ఉపకరిస్తుంది. దీంతో.. ప్రతీ రోజు ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు.

English Summary

Ginger may have numerous health benefits due to anti-inflammatory, anti-nausea, and other properties