ఇడ్లీలు చాలా మంది తీసుకునే అల్పాహారం. ప్రతీ ఇంటి దాదాపు ఇడ్లీ కనిపిస్తుంది. అన్ని వయసు ల వారు ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. ఉదయం సమయంలో అల్పాహారంలో ఇతర పదార్ధాలు ఉన్నా.. చాలా మంది ఇడ్లీకే ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇడ్లీలు తినే వారికి ఆరోగ్య పరంగానూ ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో తీసుకోవాల్సని జాగ్రతల పైనా నిపుణులు సూచనలు చేస్తున్నారు.
ప్రతీ ఉదయం ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీ పోషకాహారం గా భావిస్తారు. ఇడ్లీలకు ఉపయోగించే పిండి రాత్రంతా బాగా పులుస్తుంది. అందుకనే ఇందులో ఔషధ విలువలు పెరుగుతాయి. ఇడ్లీలలో వాడే మినప్పప్పు వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. ఇడ్లీలను పూర్తిగా ఆవిరి మీద ఉడికిస్తారు. వీటి తయారీలో ఎలాంటి నూనెలను వాడరు. దీంతో.. ఇడ్లీ ఆరోగ్యవంతమైన అల్పాహారగా చెబుతారు. ఇడ్లీలో గ్లూటెన్ ఉండదు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇడ్లీలు చక్కని ఆహారంగా సూచిస్తున్నారు.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా - ఆరోగ్యానికి మంచిదేనా..!?
అయితే, చిరుధాన్యాలతో ఇడ్లీలను తయారు చేసి తింటే ఇంకా ఎక్కువ పోషకాలను పొందే అవకాశం ఉంటుంది. అనేక బి విటమిన్లు లభిస్తాయి. ఇడ్లీలలో జీర్ణ వ్యవస్థకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఒక ఇడ్లీని తింటే సుమారుగా 40 నుంచి 50 క్యాలరీలు లభిస్తాయి. కొవ్వు అసలే ఉండదు. మిల్లెట్స్‌తో ఇడ్లీలను తయారు చేసి తింటే డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇడ్లీలు ఆరోగ్యకరమే అయినప్పటికీ ప్రస్తుతం రెడీమేడ్ పిండి మార్కెట్‌లో లభిస్తుంది. వాటి వినియోగం లో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. కొందరికి ఇడ్లీలను తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఇడ్లీలను తినకూడదు. ఇడ్లీల్లో ఫ్యాట్ లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల కొవ్వు పట్టదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.మిల్లెట్స్ ఇడ్లీతో ఎన్నో ప్రయోజనాలు