మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తీసుకుంటున్నారా, అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!?

మైక్రోవేవ్ ఓవెన్. ఫుడ్ రీహీట్ చేయడానికీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇళ్ల్లో వినియోగిస్తున్నారు. ఆహారాన్ని కొన్ని క్షణాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేస్తుంది. వంట సమయాన్ని తగ్గించి సగం శ్రమని దూరం చేస్తుంది. అందుకే, ఇప్పుడు చాలా మంది మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ మైక్రోవేవ్ ఓవెన్ వినియోగంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలో నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

Advertisement

ఇప్పుడంతా చాలామంది ఇళ్లలో మైక్రోవేవ్ ఓవెన్ అనేది అత్యవసర వస్తువుగా మారిపోయింది. మైక్రోఓవెన్లు ఎక్కువమంది వాడుతున్నారు. మైక్రోవేవ్‌లు నాన్ అయోలైజన్ రేడియేషన్ ద్వారా పనిచేస్తాయి. తినే పదార్థాలను మైక్రోవేవ్‌లో పెట్టడం వల్ల అది కాస్త హైప్రీక్వెన్సీ హీట్ వేవ్స్ మధ్య ఉంటాయి. పదార్థాలను రేడియేషన్‌కు గురయ్యేలా చేసే అవకాశం ఉంటుందనే చర్చ ఉంది. ఒక్క మైక్రో వేవ్ 2.45 బిలియన్ హెట్‌ను కలిగి ఉంటుంద ని లెక్కలు చెబుతున్నాయి. మైక్రో ఒవెన్‌లో ఆహార పదార్థాలను వండటం, లేదా వేడి చేయడం చాలా సులభం. సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ఫుడ్‌ను వెంటనే వేడివేడిగా తినే సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. అయితే, వండిన ఆహారాలను మళ్లీ మైక్రోవేవ్‌లో వేడి చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
హైడ్రా కమిషనర్ గా రంగనాధ్ ను తొలిగించండి- హైకోర్టు సంచలన ఆదేశాలు..!!

నిపుణుల సూచనలు

అదే విధంగా పదే పదే వేడి చేయటం ద్వారా కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని అలర్ట్ చేస్తున్నారు. వండిన ఆహారాల విషయంలో జాగ్రత్త..వండిన తర్వాత చల్లబడిన అన్నాన్ని మైక్రోవేవ్‌లో ఎప్పుడూ వేడి చేయకూడదు. మైక్రోవేవ్ వేడి తగిలినప్పుడు, అన్నంలో పెరిగే బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే విషపదార్థాల కారణంగా అన్నం విషతుల్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. వండిన లేదా తాజా మాంసం, అలాగే గుడ్లను మైక్రో ఒవెన్‌లో వేడి చేసినప్పుడు వాటి ప్రోటీన్ విలువలు తగ్గిపోతాయి. మాంసంలోని ప్రోటీన్ల నిర్మాణంలో మార్పులు వచ్చి, అవి జీర్ణం కావడానికి కష్టంగా మారతాయి. కొన్ని సందర్భాల్లో, ఇది కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. సాధారణంగా వండిన కూరల్ని మైక్రోవేవ్‌ లో వేడి చేస్తారు. ఇలా చేయడం వలన కూరల్లోని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి వంటి పోషకాలు తగ్గిపోయి, అవి పోషక విలువ లేని ఆహారంగా మారతాయి. మైక్రో వేవ్ ఓవెన్ లో ఆహార పదార్థాలను ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

English Summary

Microwave heating will destroy the nutrients in the food and produce unknown substances