ఆధునిక జీవనశైలి, ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి సమతుల్య పోషకాలు ఎంతైనా అవసరం. ముఖ్యంగా దైనందిన ఆహారంలో పీచుపదార్థం (డైటరీ ఫైబర్) అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తోన్నారు.
రోజువారీ ఆహారంలో పప్పులు, శనగలు, రాజ్మా, క్యారెట్, బ్రోకోలీ, చిలగడదుంప వంటి కూరగాయలను చేర్చుకోవాలి. వీటితో పాటు జామ, యాపిల్, నారింజ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా తగినంత పీచు లభిస్తుంది. బీట్‌రూట్, పాలకూర, పచ్చి బఠానీల్లోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చియా, అవిసె, బాదం వంటి సీడ్స్ కూడా కూడా రోజూ పరిమితంగా తీసుకోవచ్చు. ఆయా పదార్థాలు, పండ్లు, కూరగాయల్లో కూడా డైటరీ ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది.
క్యాలీఫ్లవర్, పచ్చి బీన్స్.. ఆవన్నీ కూడా రిచ్ ఫైబర్ సూపర్ ఫుడ్సే. ఫైబర్ అనేది శరీరం నేరుగా జీర్ణం చేసుకోలేని ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్. వృద్ధులు ప్రతిరోజూ సుమారు 25 నుంచి 38 గ్రాముల వరకు ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే రోజువారీ ఆహారంలో మార్పులు చేస్తూ ఒకేసారి అధిక మొత్తంలో ఫైబర్ తీసుకుంటే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి అసౌకర్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే క్రమంగా పీచుపదార్థాల వినియోగాన్ని పెంచుతూ, రోజూ తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. పీచుపదార్థాలు గుండె ఆరోగ్య సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్, పప్పుధాన్యాలలో లభించే కరిగే ఫైబర్ (సాల్యూబుల్ ఫైబర్), పేగులలో కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలోని హానికరమైన ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయి తగ్గుతుంది. అలాగే పేగుల కదలికలను సులభతరం చేయడం ద్వారా మలబద్ధకం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో కూడా ఫైబర్ ది కీలక పాత్రే. ఇది మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, గ్లూకోజ్ ను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. ఫలితంగా మాటిమాటికీ ఆకలి కాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది. జీర్ణవ్యవస్థలోని పేగులలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియాకు ఫైబర్ ఒక ఇంధనంగా పనిచేస్తుంది. ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తికి తోడ్పడి పేగులలను బలోపేతం చేస్తుంది.స్టార్ ఆల్ రౌండర్ రెడ్డికి బిగ్ షాక్: ఏకంగా 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన ఐసీసీ
ప్రశాంత్ కిశోర్ భవితవ్యం తేలుతోంది.. !!