చికెన్.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నా కానీ.. కొత్తగా మళ్లీ పూటకో రకం పుట్టుకొస్తూనే ఉంటాయి. అంతే కాకుండా చికెన్ అనేది మంచి ప్రొటీన్ ఫుడ్‌గా గుర్తింపు పొందింది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర వంటకాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వంటల్లో నెల్లూరు స్టైల్ చికెన్ ఒకటి.
ఘాటైన కారం, సువాసన గల మసాలాలు.. ఉడికించిన చికెన్ కలిసిన ఈ కూర ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలని అనిపించడం గ్యారంటీ అంటున్నారు. అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతీ, పరాటా, నాన్ వంటి వాటితో ఈ కూర అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో ఉపయోగించే కారం, వేయించిన మసాలా పొడి ఈ వంటకు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచితో నెల్లూరు చికెన్ ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..
కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం.. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కావాలంటే కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్‌ను కనీసం 30 నిమిషాలు పక్కన ఉంచాలి. ఒక పాన్‌లో జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కను నూనె లేకుండా స్వల్పంగా వేయించాలి. అది చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలానే నెల్లూరు చికెన్‌కు ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను ఇస్తుంది. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసి కరివేపాకు వేయాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను బాండీలో వేసి హై ఫ్లేమ్‌పై 5 నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత మంటను మధ్యస్థాయికి తగ్గించి మూతపెట్టి చికెన్‌లోని నీరు బయటకు వచ్చే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటి తర్వాత చికెన్ కొంత ఉడికిన తర్వాత ధనియాల పొడి, మిగిలిన కారం, ముందుగా తయారు చేసిన ప్రత్యేక మసాలా పొడి వేసి బాగా కలపాలి. (మసాలా చికెన్‌కు బాగా పట్టే వరకు మరో 5 నిమిషాలు వేయించాలి.) గ్రేవీ చికెన్ కావాలంటే ఇప్పుడు అవసరమైనంత వేడి నీరు పోసి మూతపెట్టి మరో 15 నుంచి 20 నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అలానే కావాలంటే కొద్దిగా నెయ్యి లేదా నిమ్మరసం వేసినా రుచి మరింత పెరుగుతుంది. సర్వింగ్ సూచనలు.. ఈ నెల్లూరు స్టైల్ చికెన్ వేడి వేడి తెల్ల అన్నం, నెయ్యి అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతీ, పరాటా, నాన్, పుల్కా లేదా జీరా రైస్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. వారాంతాల్లో కుటుంబ సభ్యుల కోసం లేదా ప్రత్యేక సందర్భాల్లో ఈ రెసిపీని తయారు చేస్తే అందరూ తప్పకుండా మెచ్చుకుంటారు.