వారానికి ఒక్క ఇంజెక్షన్‌తో అదుపులోకి మధుమేహం - ధరలు, వినియోగం..!!

డయాబెటిస్ బాధితులకు బిగ్ రిలీఫ్. ఇప్పటి వరకు ప్రతీ రోజు ఇన్సులిన్ చేసుకుంటున్న వారికి ఇక ఆ సమస్యలు ఉండవు. వారానికి ఒక సారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన కొత్త ఇంజెక్షన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ఇది ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇంజెక్ష‌న్. టైపక -1, టైప్ -2 డయాబెటిక్ బాధితులకు ఈ ఇంజెక్షన్ ప్రయోజనకంగా ఉండనుంది.

Advertisement

మధుమేహ బాధితులకు ఇక ప్రతీ రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకొనే అవసరం లేకుండా వారం లో ఇక సారి మాత్రమే తీసుకొనే కొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. కొత్త బేసల్ ఇన్సులిన్ అవిక్లీ (ఇన్సులిన్ ఐకోడెక్)ను భారత్‌లో విడుదల చేసారు. ఈ ఇంజెక్షన్ వారానికి ఒకటి మాత్రమే అవసరం కావటంతో.. ప్రతీ ఏటా 365 ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిన వారు.. ఇక నుంచి 52 చేయిస్తే సరిపోతుంది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్ వినయోగానికి అనుమతి దక్కింది. భారత్ లో వేగంగా షుగరు వ్యాధి పెరుగుతోంది. దాదాపు 10.01 కోటి మంది మధుమేహంతో సహవాసం చేస్తున్నారు. వారిలో దాదాపు 70 శాతం మంది బాధితులు ఇన్సులిన్ వినియోగిస్తున్నారు. మిగిలిన వారు టాబ్లెట్లతో నెట్టుకొస్తున్నారు. ఇక, ఇప్పుడు వారానికి ఇక్క సారి మాత్రమే తీసుకునే ఈ బేసల్ ఇంజెక్షన్ అందుబాటులోకి రావటంతో... వారు సైతం ఈ ఇంజెక్షన్ల వినియోగం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

అందుబాటు ధరల్లోనే

అవిక్లీ ధరలను భారత్ లో ఖరారు చేసారు. ఇక్కడి మార్కెట్ కు అనుగుణంగా ధరలను ఫిక్స్ చేసిన తయారీ సంస్థ నోవో నోర్డిస్క్ వెల్లడించింది. 700 ఇన్సులిన్ యూనిట్లు కలిగిన 1 మిల్లీలీటర్ అవిక్లీ పెన్ ధరను రూ.2,611గా నిర్ణయించారు. అదే విధంగా 2,100 యూనిట్లు కలిగిన 3 మిల్లీలీటర్ పెన్ ధర రూ.7,883గా ఫిక్స్ చేసారు. వారానికి 70 యూనిట్ల మోతాదు తీసుకునే రోగికి ఈ చికిత్స ఖర్చు వారానికి దాదాపు రూ.261 నుంచి రూ.263 వరకు ఉండే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం లాభాల కంటే.. ఎక్కువ మంది వినియోగించే చేయటమే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఇంజెక్షన్ షుగరు వ్యాధి బాధితులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో.. ఇక్కడా వినియోగం పెరిగితే.. వచ్చే ఫలితాల ఆధారంగా మరింత గా అమ్మకాల ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.

English Summary

Novo Nordisk has launched Awiqli, the world's first once-weekly basal insulin, in India to help adults with diabetes reduce injection burden