గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా- 'సైలెంట్ కిల్లర్' ..!!

కాలం మారింది. డిజిటల్ యుగం నడుస్తోంది. వర్క్ ఫ్రం హోం.. కంప్యూటర్ల ముందే అంతా పని పూర్తి చేయాల్సి వస్తోంది. షిఫ్టుల పేరుతో గంటల తరబడి కూర్చొని చేసే పని ఎక్కువగా ఉంది. ఆఫీసు పనులైనా, ఆన్‌లైన్ చదువులైనా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌ల ముందు కూర్చోవడం కామన్ గా మారిపోయింది. ఇది 'సైలెంట్ కిల్లర్' గా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగమే అయినా.. కంటిన్యూగా కూర్చోవటం సరి కాదని చెబుతున్నారు. దీని కారణంగా వచ్చే సమస్యల పైన హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.

Advertisement

కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కండరాలు బలహీనపడ తాయి, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నడుము నొప్పి, రక్త ప్రసరణ సరిగా జరగక చేతులు, కాళ్లలో వాపు కూడా రావచ్చు. ఇదే కాకుండా మరి కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన వెన్ను, నడుము నొప్పికి కారణంగా మారుతోంది. కాళ్లు, చేతుల్లో రక్త ప్రవాహం మందగించి తిమ్మిర్లు లేదా వాపులు కనిపిస్తాయి. కేలరీలు సరిగ్గా బర్న్ అవ్వవు, దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం కారణంగా కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. అదే విధంగా స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం వల్ల చూపు మందగించడం, మానసిక ఒత్తిడికి, చిరాకుకు కూడా కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

నిపుణుల సూచనలు

అదే విధంగా బరువు పెరగడం, గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అంతే కాదు.. ఇలా కంటిన్యూగా కూర్చొనే వారిలో జీవక్రియ మందగించడం వల్ల కేలరీలు సరిగ్గా ఖర్చు కావు. ఎప్పుడూ స్క్రీన్‌ను చూస్తూ ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు సమస్యలు రావచ్చు. ఇది మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపి అలసట, చంచలత్వం, పనిపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే, ఇలా కూర్చొని పని చేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ప్రధానంగా వెన్ను నొప్పి, కళ్లు మండటం, అలసట, చేతులు, కాళ్లలో వాపు లేదా నొప్పి, శక్తి లేకపోవడం, నిద్ర సరిగా రాకపోవడం, బరువు పెరగడం, కండరాల బలహీనత వంటి ఉన్నాయి. కూర్చొని పని చేసే వారు కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి విరామం తీసుకోవాలి. కొద్దిసేపు నడక..స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయటం ద్వారా కొంత రిలీఫ్ ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకుని, ఎక్కువగా నీరు తాగాలి. చిన్నపాటి కదలికల ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.

English Summary

Sitting or lying down for too long increases your risk of chronic health problems, such as heart disease, diabetes