పరగడుపున ఈ ఆకులు నాలుగు తింటే - షుగర్, బీపీ కంట్రోల్.. గుండె సేఫ్..!!

తులసి మొక్క కు ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్రంగా భావిస్తారు. తులసి ఆకును ఔషధంగానూ వినియోగం లో ఉంది. ఇందులో ఎన్నో ఆరోగ్యపరమైన గుణాలు ఉన్నాయి. అనేక రుగ్మ‌త‌ల‌ను నయం చేయ‌గ‌ల శ‌క్తివంత‌మైన ఔష‌ధ గుణాలు తుల‌సిలో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ప‌ర‌గ‌డుపునే నాలుగైదు తుల‌సి ఆకుల‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులతో టీ గా తీసుకున్న ప్రయజనం ఉంటుంది. తులసి ఆకులను పరగడుపున తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు.

Advertisement

తులిసిలో ఉన్న ఔషధ గుణాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. తుల‌సి ఆకుల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపున తింటే శ‌రీరం త‌న‌ను తాను ర‌క్షించుకోవడానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. తుల‌సి ఆకుల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన డిటాక్సిఫ‌యింగ్ గుణాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు, టాక్సిన్లు బ‌య‌ట‌కు వెళ్లి..లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భించి యాక్టివ్‌గా ఉంటారు. ఈ ఆకులో ఉండే అడాప్టొజెనిక్ స‌మ్మేళ‌నాలు ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గిస్తాయి. తుల‌సి ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే శ‌రీరంలో కార్టిసాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. తుల‌సి ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి. దీని వ‌ల్ల ఆహారం జీర్ణాశ‌యంలో సుల‌భంగా క‌దులుతుంది.

Advertisement
గ్రీన్ టీ ఎవరికి మంచిది, ఏ సమయంలో తాగాలి..!?

నిత్యం వినియోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు

తులసి ఆకులు తీసుకోవటం వలన అలాగే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించటంతో తోడ్పాటు అందిస్తాయి. ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తుల‌సి ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. శ‌రీరం ఇన్సులిన్‌న స‌మ‌ర్థ‌వంతంగా గ్ర‌హిస్తుంది. దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవల్స్ త‌గ్గుతాయి. రోజూ ఈ ఆకుల‌ను తింటుంటే డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌టం తో పాటుగా బీపీ త‌గ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి..గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో, ప్రతీ రోజూ ప‌ర‌గ‌డుపునే తుల‌సి ఆకుల‌ను తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

English Summary

Tulasi leaves on an empty stomach every morning may help support immunity, reduce stress, promote heart health