23 ఫిబ్రవరి 2019 శనివారం దినఫలాలు


డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువులపై విజయానికి ప్రయత్నిస్తారు.పోటీలలో గెలుపు సాధిస్తారు.విద్యార్థులకు అనుకూల సమయం.ఋణబాధలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు.రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

వృష భరాశి

ఈ రోజు సృజనాత్మకతను కోల్పోయే ప్రమాదం.ఆలోచనలు తగ్గించాలి. మానసిక ప్రశాంతత పెంచుకునే ప్రయత్నం చేయాలి.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు తలెత్తే సూచనలు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది.

మిథునరాశి

ఈ రోజు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు.మానసిక అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది.వాటికై ఆరాట పడతారు.ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కర్కాటకరాశి

ఈ రోజు మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. స్త్రీలు అనుకూలిస్తాయి. సహాయ సహకారాలుంటాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రచార ప్రసార సాధనాలు లాభిస్తాయి.దగ్గరి ప్రయాణాలు చేస్తారు. బంధువర్గీయులతో ఆత్మీయత ఏర్పడుతుంది.

సింహరాశి

ఈ రోజు మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కోల్పోతారు. వాగ్దానాల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాల జోలికి పోకూడదు. కింసంబంధ లోపాలు వచ్చే సూచనలు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త అవసరం.

కన్య రాశి

ఈ రోజు శారీరక శ్రమ ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొంత సంతృప్తి వచ్చే సూచనలు. శుభ కార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. ఆహారంపై దృష్టి పెంచుకుంటారు. ఆరోగ్యం కాపాడుకోవాలి.

తులరాశి

ఈ రోజు అనవసర ఖర్చులు ఉంటాయి. చిత్త చాంచల్యం ఉంటుంది. నిత్యావసర ఖర్చులపై దృష్టి అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం.సుఖంకోసం ఆరాట పడతారు.విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికరాశి

ఈ రోజు సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళాకారులతో అనుకూలత ఉంటుంది.దైవ ఉపాసనలు పెంచుకునే ప్రయత్నం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కంపెనీలు, షేర్లు మొదలైన వాటిపై దృష్టి పెరుగుతుంది. సమస్యలన్నికీ పరిష్కారం లభిస్తుంది.

ధనస్సు రాశి

ఈ రోజు అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో స్త్రీలతో అనుకూలత ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం.

మకరరాశి

ఈ రోజు అనవసర ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది.నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చేసే అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.

కుంభరాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలు ఉంటాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరాశ్రయ ఉంటుంది. ఆకస్మిక ఇబ్బందులు. మానసిక ప్రశాంతత అవసరం.

మీనరాశి

ఈ రోజు భాగస్వాములతో సహకారం లాభిస్తుంది. పది మందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలం.సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు పెంచుకునే ప్రయత్నం.వాటివలన సంతోషం కలుగుతుంది.

Have a great day!
Read more...

English Summary

Daily horoscope for friday november 3– here’s what the stars have in store for you today