వాస్తు ప్రకారం ట్రెండీగా ఉందని ఈ మొక్కను తెచ్చుకుంటే.. సర్వం గోవిందా


ప్రస్తుతం ఆధునిక గృహాలంకరణలో కొరియన్, నార్డిక్ వంటి పాశ్చాత్య శైలి డిజైన్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇందులో భాగంగా ఎండిపోయిన పత్తి మొక్కలు, పత్తి కాయల గుత్తులను అందమైన ఫ్లవర్ వాజ్ లల్లో అమర్చి అలంకరించడం అనేది సరికొత్త ట్రెండ్‌గా మారింది. నేటి యువతరానికి ఈ రకమైన డెకర్ పద్ధతులు ఎంతగానో నచ్చుతున్నాయి. వాస్తు ప్రకారం ఇలాంటి శైలిని అనుసరించి పత్తిని ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు.

Advertisement

వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అవి తమ చుట్టుపక్కల వాతావరణంలోకి ఒక నిర్దుష్ట తరంగాన్ని, శక్తిని విడుదల చేస్తాయి. పత్తి మొక్క స్వభావం చాలా ఎండిపోయినట్లు, ఎటువంటి జీవకళ లేకుండా ఉంటుంది. ఇలాంటి నిర్జీవమైన వస్తువులను ఇళ్లలో ఉంచడం వల్ల సానుకూల శక్తి క్రమంగా క్షీణించిపోతుంది. దీనివల్ల కుటుంబంలో దరిద్రం తలెత్తడమే కాకుండా, మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. దురదృష్టం వెంటాడుతుందని విశ్వసిస్తారు.

Advertisement

పత్తి కాయల గుత్తులు చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, చూడ్డానికి బాగున్నట్టు అనిపించినప్పటికీ వాస్తు ప్రకారం వీటి ప్రభావం అంత అనుకూలం కాదు. వాస్తు ప్రకారం ఎండిపోయిన పువ్వులు లేదా మొక్కలు గృహంలో ఉంటే ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. నివాస స్థలాల్లో పత్తిని ఉంచితే కుటుంబ సభ్యుల వృత్తి, పురోగతి స్తంభించిపోతుంది. ఇది ఇంట్లోని వారికి మానసిక ఒత్తిడిని కలిగించడమే కాక, అనవసరమైన మనస్పర్థలు, గొడవలకు కారణమౌతుంది.

ఫిఫా సెమీస్ లో కొదమసింహాల పోరు- ఫ్రాన్స్ కు క్లినికల్ షాట్: ఎంబాప్పె కంట తడి: ఫైనల్ లో..!!
Advertisement

శాస్త్రాలలో పత్తి మొక్కలే కాకుండా, పాలు కారే మొక్కలకు సంబంధించి కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి. ఆకులు లేదా కొమ్మలను తుంచినప్పుడు తెల్లటి పాలు వంటి ద్రవం విడుదల చేసే మొక్కలను ఇంటి లోపలి భాగాలలో అస్సలు ఉంచకూడదు. ముఖ్యంగా బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌లలో పాలు కారే మొక్కలను అలంకరణ కోసం ఉపయోగిస్తే తీవ్ర ధన నష్టం సంభవిస్తుంది. ఇది వ్యాపారాల్లో భారీ నష్టాలకు కారణం కావడమే కాకుండా, ఇంట్లోని కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇంట్లో ఎప్పుడూ సంతోషం, సంపద వెల్లివిరియాలంటే జీవకళ ఉట్టిపడే ఆకుపచ్చదనంతో విలసిల్లే మొక్కలను మాత్రమే పెంచుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్, తులసి, అరికా పామ్ లేదా స్నేక్ ప్లాంట్ వంటివి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, సంపదను ఆకర్షిస్తాయి. గృహాలంకరణ అనేది ఇంటి అందానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. మనం ఎంచుకునే వస్తువులు, మొక్కలు మన దైనందిన జీవితాలపై, ప్రశాంతతపై ఎంతో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి.

English Summary

Cotton Plant Vastu as the Negative Energy Believed to Come Not Recommended for Indoor Decor Throw Off Balance. There is a theory that its thorny pods and spiky nature bring bad energy into the home. Cotton plants may hinder Vastu’s goal of a balanced and happy setting.