ఆగస్టు 8 నుంచి సింహం, మీనం, మేషం, మిథున రాశులకు లక్ష్మీకటాక్షం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనతో పాటు వాటి మధ్య ఏర్పడే ప్రత్యేక దృష్టికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 8న శనివారం మధ్యాహ్నం 2:59 గంటలకు బుధ, కుజ (అంగారకుడు) గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి ప్రవేశించబోతున్నాయి. ఈ పరిణామం వల్ల అత్యంత శ్రేష్ఠమైన 'ద్విద్వాదశ దృష్టి యోగం' ఆవిర్భవిస్తోంది.

Advertisement

ఈ అరుదైన యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, హఠాత్ ధనలాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు చూద్దాం.

Advertisement
ధనుస్సు రాశి, మకర రాశి ఆగస్టు నెల జాతక ఫలం

సింహ రాశి

సింహ రాశి వారికి ఆగస్టు 8 నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతోందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభించి పదోన్నతులు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. పాత అప్పుల భారం నుంచి సులభంగా బయటపడతారు. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి.

మీన రాశి

బుధ, కుజ గ్రహాల కలయిక మీన రాశి వారి భాగ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఊహించని రీతిలో ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మునుపెన్నడూ లేని విధంగా మంచి పురోగతి కనిపిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి తగ్గి, నూతనోత్తేజంతో ము ముందుకు సాగుతారు.

Advertisement
మేష రాశి, వృషభరాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలు

మేష రాశి

మేష రాశి వారికి ఈ యోగం లక్ష్మీదేవి వరంలా మారబోతోంది. దీర్ఘకాలంగా రావలసి ఉన్న పాత బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు దక్కడం వల్ల లాభాలు రెట్టింపవుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా, దాంపత్య జీవితంలోని పొరపొచ్చాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

మిథున రాశి

మిథున రాశి వారు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి ఈ యోగం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించని విధంగా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రేమ, వైవాహిక జీవితాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా నెరవేరని కోరికలు ఈ సమయంలో ఈడేరుతాయి.

English Summary

Horoscope: Astrologers state that four zodiac signs will be blessed with the grace of Goddess Lakshmi as Mars and Mercury come together at a 30-degree angle starting August 8.