శని, బృహస్పతి వల్ల కుంభం, సింహం, వృషభరాశులకు అంతులేని అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన శని దేవుడు, దేవగురువైన బృహస్పతి చేసే సంచారాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత ఆషాడ, శ్రావణ మాసాల వేళ.. ఈ రెండు పెద్ద గ్రహాల స్థితిలో అరుదైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జూలై నెలాఖరుకు ముందే గురు గ్రహం సూర్యుడి సాన్నిహిత్యం వల్ల అస్తంగతం కాబోతుండగా.. మరోవైపు కర్మఫలదాత అయిన శని దేవుడు వక్రగతిలోసంచరించనున్నాడు.

Advertisement

జూలై 16న అస్తమించనున్న గురువు ఆగస్టు 11 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఇక శని దేవుడు డిసెంబర్ 10 వరకు (సుమారు 138 రోజుల పాటు) వక్రగతిలోనే కొనసాగనున్నాడు. ఈ అరుదైన గ్రహాల కదలికల వల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం వరించబోతోంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

వృషభ రాశి

శని, గురువుల మార్పు వృషభ రాశి వారికి ఊహించని అదృష్టాన్ని, సంతోషాన్ని తీసుకురాబోతోంది. సొంత ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల ఈ సమయంలో సాకారమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం టర్నింగ్ పాయింట్‌గా మారబోతోంది. కొత్త డీల్స్ కుదురుతాయి.కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహార యాత్ర లేదా సుదూర పుణ్యక్షేత్ర దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు.

సింహ రాశి

శని వక్రగతి, గురుడి అస్తమయం వల్ల సింహ రాశి వారి జీవితంలోకి అపారమైన ధన సంపద వచ్చి చేరబోతోంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వీరికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి తగాదాలు తీరి, మీ చేతికి అందుతాయి. ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి లేదా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు ఊహించని లాభాలను గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది.

Advertisement

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ గ్రహాల సంచారం 'అపార ధన యోగాన్ని' తెచ్చిపెట్టబోతోంది. శ్రావణ మాసం నుంచి వీరి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన మొండి బకాయిలు, రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇవి మంచి లాభాలను ఇస్తాయి.

English Summary

Horoscope: With Jupiter remaining combust until August 11 and Saturn moving in retrograde motion until December 10, immense good fortune is in store for three zodiac signs.