ఆగస్టు 5వ తేదీ వరకు ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్యశాస్త్రంలో బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారాలకు అధిపతిగా పరిగణించే బుధ గ్రహ సంచారంలో కీలక మార్పు సంభవించింది. గ్రహాల యువరాజుగా పిలిచే బుధుడు జులై 7న తన సొంత రాశి మిథునరాశిలోకి ప్రవేశించి వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. ఆగస్టు 5 వరకు (సుమారు 30 రోజుల పాటు) బుధుడు ఇదే తిరోగమన స్థితిలో కొనసాగుతాడు. సాధారణంగా గ్రహాల వక్రగమనం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, స్వక్షేత్రంలో జరిగే ఈ మార్పు వల్ల 4 ప్రత్యేక రాశుల జాతకులకు మాత్రం లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఊహించని ధనయోగంతోపాటు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.

Advertisement

తులా రాశి

తులా రాశి వారి జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో సమసిపోతాయి. మానసిక, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఊరట లభిస్తుంది. ఆస్తి, భూ వివాదాలు కోర్టులు లేదా బయట మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్లానింగ్ జరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వినే అవకాశముంది.

Advertisement

మిథున రాశి

సొంత రాశిలోనే బుధుడి వక్రగమనం జరగడం వల్ల మిథున రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. దీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించి, ప్రమోషన్ లేదా జీతాల పెంపు రూపంలో శుభవార్తలు వింటారు. ఎంత లాభసాటిగా ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ 30 రోజుల కాలం గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ముందడుగు వేయడానికి సువర్ణ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఉన్న వీసా సంబంధిత చట్టపరమైన చిక్కులన్నీ క్షణాల్లో తొలగిపోతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అను అనుకూల ఫలితాలు దక్కుతాయి.

Advertisement

ధనుస్సు రాశి

బుధుడి వక్ర మార్గం వల్ల ధనుస్సు రాశి వారి ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేని విధంగా బలపడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అనుకోని మార్గాల నుంచి ఆదాయం సమకూరి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఈ 4 రాశుల వారు బుధుడి అనుగ్రహం మరింత పెరిగేందుకు రోజూ గణపతి ఆరాధన చేయడం వల్ల వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అపారమైన విజయాలు సాధించవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

English Summary

Horoscope: Mercury, the 'Prince of Planets,' will be transiting in retrograde motion through its own zodiac sign, Gemini, until August 5th. Experts state that four zodiac signs will reap wonderful benefits from this.