కొద్దిరోజులు ఓపిక పడితే ఈ రాశుల దశ, దిశ మారుతున్నాయి

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు మార్పునకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నీడ గ్రహంగా, శీఘ్ర మార్పులకు కారకుడిగా భావించే రాహువు రాబోయే డిసెంబర్ 5వ తేదీన తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం కుంభ రాశిలో కొనసాగుతున్న రాహువు, శని భగవానుడికి చెందిన మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Advertisement

సాధారణంగా ఒక రాశిలో రాహువు సుమారు 18 నెలల పాటు ఉంటాడు. శని క్షేత్రమైన మకరంలోకి రాహువు సంచారం వల్ల కొన్ని రాశుల జాతకులకు విశేషమైన యోగాలు, అయాచిత ధనలాభాలు, సమాజంలో ఉన్నత స్థాయి గౌరవ మర్యాదలు లభించనున్నాయని పంచాంగ కర్తలు చెబుతున్నారు.

Advertisement

సింహ రాశి

సింహ రాశి వారికి రాహువు ఇచ్చే రాజయోగం వల్ల అన్ని రంగాల్లోనూ అదృష్టం తోడుగా నిలుస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు దక్కడంతో పాటు మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా విస్తరిస్తాయి. వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తారు. వ్యక్తిగత జీవితంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు, విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి. దాంపత్య జీవితం ఎంతో మధురంగా, సంతోషకరంగా సాగుతుంది.

కుంభ రాశి

రాహువు మీ రాశిని వీడి మకరంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఈ మార్పు కుంభ రాశి వారికి అత్యంత శుభఫలితాలనే ఇస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఊహించని ఆఫర్లు వస్తాయి. భారీ జీతాల పెంపుతో పాటు ఉన్నతమైన హోదాలు దక్కుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆఫీసు లేదా పని చేసే ప్రదేశంలో ఉన్నతాధికారుల నుండి పరిపూర్ణ మద్దతు లభించి, మీ ప్రాబల్యం పెరుగుతుంది.

Advertisement

తులా రాశి

తులా రాశి వారికి రాహువు మకర సంచారం అత్యంత అనుకూలమైన ఫలితాలను అందించబోతోంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి, విలాసవంతమైన జీవనశైలిని పొందుతారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని లేదా అక్కడ స్థిరపడాలని కలలు కనేవారికి రాబోయే 18 నెలల కాలంలో ఆ కోరిక నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథున రాశి

మిథున రాశి జాతకులకు కెరీర్ పరంగా ఈ కాలం ఒక రకంగా 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి అంచనాలకు మించిన ప్రమోషన్లు, హోదాలు దక్కుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా భారీ ఆర్థిక లాభాలు కలిగే ఛాన్స్ ఉంది. గతంలో నిలిచిపోయిన లేదా రావలసిన పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి మీ చేతికి అందుతాయి.

English Summary

Horoscope: Rahu, currently in Aquarius, is set to enter Capricorn on December 5th. Astrologers state that this transition will bring wonderful fortunes to four zodiac signs.