ధనిష్ఠా నక్షత్రలోకి రాహువు, డిసెంబరు వరకు తుల, మేషం, సింహరాశివారే మహారాజులు

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన గ్రహంగా భావించే రాహువు తన నక్షత్రాన్ని మార్చాడు. జూన్ 30, మంగళవారం రోజున రాహువు కుంభ రాశి నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 2026 వరకు రాహువు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, మంగళవారం నాటి ఈ మార్పు వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహంతో పాటు రాహువు ఆశీస్సులు కలిసివచ్చి, ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం వరించబోతోంది. ఆ రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

తులా రాశి

తులా రాశి వారికి రాహువు ధనిష్ఠ నక్షత్ర సంచారం కెరీర్, వ్యాపార రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. వ్యాపారస్తులు ఈ కాలంలో చేసే సుదూర ప్రయాణాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో కీలకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మెరుగైన ప్యాకేజీతో కూడిన మంచి ఆఫర్లు తలుపు తడతాయి. ఈ సమయంలో మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.

Advertisement

మేష రాశి

మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో ఒక సరికొత్త ఉత్తేజం రాబోతోంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు సులభంగా తెరుచుకుంటాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఒక నమ్మకమైన స్నేహితుడు లేదా సన్నిహితుడు అందించే సాయం మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. వారు ఆశించిన అద్భుత ఫలితాలు సాధిస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ కాలం అదృష్టాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి లేదా అదనపు బాధ్యతలతో కూడిన మంచి హోదా దక్కుతుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో లాభాలు అందుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నీ సమసిపోతాయి. ఇంట్లో సుఖసంతోషాలు పెరిగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

English Summary

Horoscope: Rahu entered the Dhanishta Nakshatra yesterday. Astrologers state that this will bring wonderful results for those belonging to the Leo, Libra, and Aries zodiac signs.