మీనంలో శని తిరోగమనం.. 4 రాశుల జాతకం బ్రహ్మాండం

జ్యోతిష్య శాస్త్రంలో 'న్యాయాధిపతి', 'కర్మఫలదాత'గా భావించే శనిదేవుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మానవులు చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇచ్చే శని భగవానుడు, ఇటీవల మీన రాశిలో తిరోగమనం చెందాడు. డిసెంబర్ 11 వరకు శనిదేవుడు ఇదే స్థితిలో కొనసాగనున్నాడు. ఈ తిరోగమన సంచార ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానుంది. వ్యాపారంలో ఊహించని ప్రయోజనాలు, ఉద్యోగంలో పదోన్నతులు, ఆకస్మిక ధనలాభంతో ఈ రాశుల వారి జాతకం బ్రహ్మాండంగా ఉంటోంది. వారి వివరాలను తెలుసుకుందాం.

Advertisement
తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలం
Advertisement

తులా రాశి

శనిభగవానుడి శుభ దృష్టి వల్ల తులా రాశి వారి జీవితంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆస్తులు, స్థలాలు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం స్పష్టంగా కనిపిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి తీపి కబురు అందుతుంది. అనాలోచిత ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది, ఫలితంగా ఆర్థిక నిలకడ సాధిస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని వక్రీకరణ అపారమైన శుభ ఫలితాలను తెచ్చిపెట్టనుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు పైఅధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మంచి జీతంతో కూడిన కొత్త ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి.

Advertisement
మేష రాశి, వృషభరాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలు

కన్యా రాశి

కన్యా రాశి వారికి శనిదేవుడు 5, 6 స్థానాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ తిరోగమన కాలంలో వీరికి ఎన్నాళ్లోగానో వేధిస్తున్న సమస్యలన్నీ ముగిసిపోతాయి. కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా, ప్రమోషన్ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను చవిచూస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాంపత్య జీవితంలో అనుకూలత పెరిగి, సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మకర రాశి

శనిదేవుడి సొంత రాశి అయిన మకర రాశి వారికి ఈ సమయం బంగారు భవిష్యత్తును ప్రసాదించనుంది. బిజినెస్‌లో పెద్ద పెద్ద డీల్స్ కుదురుతాయి. కొత్త ఆర్డర్లు చేతికి అందుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, ప్రాబల్యం పెరుగుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న వివాదాలు సమసిపోయి, కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది.

English Summary

Horoscope: Lord Shani will be in retrograde motion in the Pisces sign until December 11. Astrologers state that this will bring tremendous benefits to four zodiac signs.