ఆగస్టు 12 వ తేదీలోపు ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర సంచారానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నవగ్రహాల సేనాధిపతిగా, ధైర్యసాహసాలకు కారకుడిగా భావించే కుజుడు (అంగారకుడు) త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో 'మృగశిర' నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు.

Advertisement

ఆగస్టు 12వ తేదీ వరకు కుజుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ సుమారు 20 రోజుల కాలంలో కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోబోతోంది. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ సమయం అపారమైన ధనలాభాన్ని, ఊహించని విజయాలను తెచ్చిపెట్టబోతోంది.

Advertisement

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని మోసుకొస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ మనసులో చాలా కాలంగా నలుగుతున్న పెద్ద పెద్ద కోరికలు, కలలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక వెసులుబాటు లభిస్తాయి. వైవాహిక జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న విభేదాలు, గొడవలు ముగిసిపోతాయి. కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి, డబ్బు కొరత పూర్తిగా తీరుతుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు కెరీర్‌లో అపారమైన విజయం లభిస్తుంది.

Advertisement

మేష రాశి

కుజుడి నక్షత్ర మార్పు మేష రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతాయి. వ్యాపారాలు చేసే వారికి బంపర్ లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు కెరీర్‌లో ఊహించని ప్రగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. తండ్రి వైపు నుంచి పూర్తి మద్దతు, ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది.

సింహ రాశి

కుజుడి సంచారం వల్ల సింహ రాశి వారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి.

English Summary

Horoscope: On July 24, Mars enters the Mrigashira Nakshatra and remains there until August 12. This brings good fortune to four zodiac signs.