గణేష్ చతుర్థి: వినాయక పూజా విధానం, ఏం కావాలి, ఎలా చేయాలి?


డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

పంచాంగం :-

తేదీ13 - 09 - 2018 గురువారం

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

వర్ష ఋతువు,

భాద్రపద మాసం,

శుక్ల పక్షం,

తిధి :- చతుర్థి / చవితి మద్యహ్నం 2:54 వరకు

తదుపరి పంచమి,

నక్షత్రం :- స్వాతి రా. 12:54 .

యోగం:- బ్రహ్మం ఉ 6:55

,తదుపరి ఐంద్రం

రా.తె 5:10,

కరణం:- వణిజ ఉ 6:20

తదుపరి భద్ర/విష్ఠి

సా 5:51,

ఆ తదుపరి బవ తె 5:41,

సూర్యరాశి :- సింహం,

చంద్రరాశి :- కన్య,

సూర్యోదయం :- 5:51సూర్యాస్తమయం : 6:02,

రాహుకాలం :- మ1:30 నుండి 3:00 వరకు ,

యమగండం :- ఉ 6:00 - 7:30,

వర్జ్యం :- ఉ 6:40 నుండి 8:15 వరకు,

దుర్ముహూర్తం :- ఉ 10:01 నుండి 10:50 వరకు తిరిగి

మ. 2:53 నుండి 3.41 వరకు ,

శుభ సమయం ఉదయం 8:20 నుండి 9:00 వరకు తిరిగి సా.4:00 నుండి 4:30 వరకు.

వినాయకున్ని పూజించుకునే సమయాలు:- ఉదయం 8:20 నుండి 9:00 వరకు ,

9:00 నుండి 10:00 వరకు ,

10:51 నుండి 12:00 వరకు ,

మద్యాహ్నం 1:00 నుండి 2:00 వరకు శుభం.

వినాయక చవితి /చతుర్థి విశేషం

భాద్రపద శుక్ల పక్ష చవితి వినాయక చవితి.

ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను 'వినాయక చవితి' లేదా ' గణేశ చతుర్ధి' పర్వదినంగా జరుపుకుంటారు. వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను

చవితి రోజున చంద్రుణ్ణి చూడడం దోషం, చవితి చంద్రుడు ఈ రోజునుండే ఆకాశంలో విహరిస్తాడు.

ఎవరైనా చెంద్రుడిని పొరపాటున చూసినచో ఈ మంత్రం జపము చేయడం చాలా మంచిది.

సింహః ప్రసేన మవదీత్,

సింహో జాంబవంతాహతః,

సుకుమారక మారోధి,

స్తవహ్యేశ స్యమంతకః

పూజకు కావాల్సినవి

శ్రీ వరసిద్ది వినాయక పూజకు కావలసిన వస్తువులు,పూజా విధానము.

వినాయకవ్రతకు:

పసుపు 25 గ్రా.

కుంకుమ 25 గ్రా.

పసుపు గణపతి

మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం

బియ్యం అరకిలో

తమలపాకులు 20

అగరవత్తులు 1 పేకట్

ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)

దీపము ( కొబ్బర నూనెతో శ్రేష్టం,ఆవునేతితోగాని)

పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపలు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ

హరతి కర్పూరం

పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము :- వినాయక ప్రతిమ మట్టిదే వాడవలెనా? రంగుది వాడవలనా ? అనే సందేహానికి గణేశ పురాణంలో సమాధానం కలదు.

శ్లో :- పార్థివి పూజితమామూర్తి స్థైవావా పురుషాన్వా ఏకదడతి సా కామ్యం ధన పుత్రం పశునపీ

పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించినచో ధన, పుత్రు, పశ్వాది అన్నీ సంపదలను పొందవచ్చు.

ఆ ప్రతిమ ఎటిమతో చేయవలెను?

" మృత్తికాంశం సుందరమ్ స్నిగ్ధాం సంచలనం పాషాణ వర్జితాం "

శుభ్రం చేసిది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చమైన నీటితో తడిపి ప్రతిమచేయవలెను

శ్లో లో . చంద్రశేఖ్ విరాజితాం

నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను సవ్యముగా చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యమని కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసిన ఇచ్చులు వినాయకచవితి ముందురోజు నుండే పెడుతున్నారు. ప్రతిమ అన్నిటికన్నా మంచిదని గణేశ పురాణము బట్టి గ్రహించవలెను.

దూర్వాయుగ్మ పూజ :

వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా " మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా " అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు.

" వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే

తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా

భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్

నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : "

పసుపు గణపతిని పూజించాలి

వినాయక చవితి రోజున చేయుటకు వినాయక వ్రతము ప్రముఖ శుభకార్యం కాబట్టి ముందు పసుపుతో చేసిన గణపతి పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలెను.స్వామి వారు తూర్పు దిశ చూస్తున్నట్లు ఉండవలెను. కొబ్బరి నూనే లేదా ఆవునేతితో దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

శ్రీ మహాగణాధిపతియే నమః : శ్రీ గురుభ్యోనమః : హరి : ఓం

శ్లో లో . శుక్లాం బరధరం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే .

మంత్రం:- ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా : పశో వదంతి శమోమండేషమూర్జంయాహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు

అయ ముహూర్త స్సుముహూర్తో అస్తు.

ఆచమనం :-

పాత్ర (అనగా చిన్న చెంబు లేక గ్లాసు) నీటితో లేదా స్పర్శతో ఆచమనం చేయవలెను. బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.

ఓం కేశవాయ స్వాహా :

ఓం నారాయణాయ స్వాహా :

ఓం మాధవాయ స్వాహా :

( ఈ మూడు నామములను చెప్పుకుంటూ కుడి చేతిలో నీరు వేసుకొని శబ్ధం రాకుండా త్రాగవలెను )

ఓం గోవిందయ నమః : ( చేయ్యి కడుగ వలెను .)

ఓం ఓం త్రివిక్రమాయ నమ : ఓం వామనాయ నమ : ఓం శ్రీధరాయ నమ : ఓం హుర్షీకేశవాయ నమ : ఓం పద్మనాభాయ నమ : ఓం దామోదరాయ నమా : ఓం సంకర్షణాయ నమా : ఓం వాసుదేవయ నమ : ఓం ప్రాయోమమయ నమా : ఓం పురుషోత్తమయ నమా : ఓం అధోక్షోజయ నమ : ఓం అచ్యుతాయ నమా : ఓం జనతనాయ నమ : ఓం హరయే నమ : ఓం శ్రీ కృష్ణాయ నమ :

దైవ ప్రార్థన :-

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.

శ్లో :- ఓం యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళం | తయోస్సంస్మరణాత్ పూర్వం సర్వతో జయ మంగళం

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరహశ్యామో హృదయ స్థోజనార్థన :

సర్వమంగళ మాగళ్యే శివే సర్వార్థసాధకే | శరణ్యే త్ర్యంబకేదేవి నారాయణి నమోsస్తేతే .

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ : ఉమా మహేశ్వరరాభ్యాం నమ : శచీ పురంధరాయణ నమ : అరుంధతి వశిష్టాభ్యాం నమ : శ్రీ సీతారామభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ: ||

( క్రింది విధముగా చదువుతూ అక్షితలను వెనుక వేసుకొనవలెను )

శ్లో :- ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

ప్రాణానాయమ్య ( ముక్కు పట్టుకుని )

ఓం భూ : ఓం భువ : ఓం సువ : ఓం మహా : ఓం జన : ఓం తప : ఓగ్ం సత్యమ్ ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధియోయోన ప్రచోదయాత్ ఓమ్ ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమ చెయ్యి ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భుర్భువస్సువరోం వరకు మంత్రం చదివేంత వరకు గాలిని బంధించి తరువాత మెల్లగా గాలిని కుడి వైపున ముక్కు రంధ్రం ద్వారా వదలాలి.( దీనిని బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళ సహయంతో చేయవలెను.)

సంకల్పము

సంకల్పము :

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే , శ్రీ మహా విష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ............... .నామా సంవత్సరము, దక్షిణాయేనే, వర్షరుతుడు, భధ్రపదమాసే, శుక్లప క్షేత్రం, చతుర్థ్యం .................. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ ............ గోత్ర: ......... .నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం , ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవత క దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ( అని సంకల్పం చేసి )

( కలశంలోని నీరు ముట్టుకొనవలెను )

శ్లో : కలశస్య ముఖే విష్ణు : కంఠే రుద్రస్సమాశ్రిత:|

మూలే తత్రస్థితో బహ్మ మధ్యే మాతృగణా స్సౄతా:

కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా |

ఋగ్వేదోధయర్వేద స్సామవేదో హ్యధర్వణ:|

అంగైశ్చ సహిత స్సర్వే కలశాంబు సమాశ్రితా:||

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరషిచ్యతే ఉక్ధైర్యజ్ఞేషు వర్ధతే , ఆపోవా ఇదగ్ం సర్వం| విశ్వభూత న్యాప: ప్రాణావా ఆప: పశవ ఆపో౭న్నమాపో౭ మృత మామస్సమ్రాడాపో విరాడాప స్వరాడా పశ్చందాగ్ శ్యాపో జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాప స్సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం .

గంగేచయమునేచైవ గోదావరి సరస్వతీ|

నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు||

ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్ధం మమ దురతక్షయ కారకా:|| కలశోదకేన దేవత, ఆత్మానం, పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య.

(కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజద్రవ్యముల పైన చల్లవలెను.

గణపతి పూజ

ప్రాణ ప్రతిష్ట

(పుష్పముతో పసుపు గణపతి తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.

అసునీ తేపునరస్మాసు చక్షు : పునః : ప్రాణ మినహనో దేహి భోగమ్|

జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమంతే మృడయాన స్వస్తి

ఓం అమృతం వై ప్రాణా: అమృతమాప: ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే||

స్థిరోభవ,వరదోభవ,సుముఖోభవ,సుప్రసన్నోభవ,స్థిరాసనం కురు|| .

ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్.

షోడశోపచార పూజ :

(క్రింది విధంగా చెబుతూ ఒక్కొక్కటికి గణపతికి అక్షితలను సమర్పించవలెను.)

శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి.

(అగరోత్తులు వెలిగించి దూపము చూపించాలి)

శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.

(దీపానికి నమస్కరించవలెను.)

దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి. నైవేద్యం సమర్పామి.

నైవేద్యం:-

బెల్లము వండిన ప్రసాదం మీద నీరు చల్లి చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.

ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్.

నీళ్ళు పుష్పంతో చల్లి

ఓం సత్యం త్వర్తేన పరిషించామి.

పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి.

ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం

ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.

శ్రీ మహాగణాధిపతియే నమః: తాంబులం సమర్పణమి.

(కర్పూరం వెలిగించి గంట మ్రోగించాలి)

శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పణమి

పూజ చేసిన అక్షితలను, పుష్పములు శిరస్సున ధరించవలెను.

శ్లో : యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.

అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు

అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.మనస్పూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి.

ఉద్వాసన :

యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ||

పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

గణపతి అష్టోతర శతనామావళి

ఓం వినాయకాయ నమ:

ఓం గ్రహపతయే నమ:

ఓం అగ్రగణ్యాయ నమ:

ఓం విఘ్నరాజయ నమ:

ఓం కామోనే నమ:

ఓం గ్రామణ్యై నమ:

ఓం గౌరీపుత్రాయ నమ:

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:

ఓం గణపాయనమ:

ఓం గణేశ్వరాయ నమా:

ఓం పాశాంక్శధరాయ నమ:

ఓం స్దిరార నమ:

ఓం స్కందాగ్రజాయ నమ:

ఓం చందయ నమ:

ఓం వృద్ధిదాయ నమ:

ఓం అవ్యయేయ నమ:

ఓం గుణితతాయ నమా:

ఓం సుభాగే నమ:

ఓం పూతాయ నమ:

ఓం నిరంజానాయ నమ:

ఓం శూరయ నమ:

ఓం దక్షాధరాశియ నమ:

ఓం అకల్మాషాయ నమ:

ఓం వాగీశాయ నమ:

ఓం ద్విజప్రియే నమ:

ఓం స్వయంసిదాణ్య నమ:

ఓం సిధిత్య నమ:

ఓం అగ్నిగర్వభిదేశ్ నమ:

ఓం సిద్దార్చితవతాంబుజయ నమ:

ఓం దూర్వాబిల్విప్రియాయ నమ:

ఓం ఇంద్రద్రిప్రైతియ నమ:

ఓం బీజాపూరకాయ నమ:

ఓం కాంతాయ నమ:

ఓం వాల్బలప్రియయే నమ:ఓం అవ్యక్తయే నమ:

ఓం పాపహారిణేనమ:

ఓం సర్వసిద్దప్రతికాయ నమ:

ఓం వరయియమ్ నమ:

ఓం కృతమాయ నమ:

ఓం శర్వతాయాయ నమా:

ఓం శాశ్వతాయ

ఓం సమహితాయ నమ:

ఓం శర్వప్రియయే నమ:

ఓం కృతినే పేరు:

ఓం వకృతుండయ నమ:

ఓం సర్వాత్మ్య నమ:

ఓం విద్వాత్రియయ నమః:

ఓం శ్రీప్రైటి నమ:

ఓం క్రియేకర్ర్తేనామ:

ఓం వీతభయాయ నమః:

ఓం సౌమ్య్యాయ నమ:

ఓం దేవానీకార్చుాయ నమ:

ఓం గణనే నమ:

ఓం భక్తికాంక్షితాదాయితే నమ:

ఓం షివాయ నమ:

ఓం చక్రిణే నమ:

ఓం అచ్యుతాయ నమ:

ఓం శుడేది నమ:

ఓం ఇక్షుచాపధతేతే నమ:

ఓం కేవలాయ నమ:

ఓం బుద్దిప్రియయే నమ:

ఓం అబ్జోత్పలకరాయ నమ:

ఓం సిద్దాయియ నమ:

ఓం శాంతాయ నమ:

ఓం శ్రీశాయ నమ:

ఓం జ్ఞానినే పేరు:

ఓం బ్రహ్మచారిణి నమ:

ఓం శ్రీపతయే నమ:

ఓం మాయాపాయణ నమ:

ఓం గజాననాయ నమ:

ఓం స్తుతిహర్షితా నమ:

ఓం కాంతాయ నమ:

ఓం డత్మేమాతురాయనమ:

ఓం కులాద్రిభారతే నమ:

ఓం బ్రహ్మిష్ఠాయ నమ:

ఓం మునిస్థతాయ నమ:

ఓం జటినే నమ:

ఓం భయవర్జితాయ నమ:

ఓం భక్తవిఘ్నవినాశినే నమ:

ఓం చంద్రచూడాయ నమ:

ఓం ప్రమత్తదైత్యభయాయ నమః:

ఓం ఏకదంతాయ నమ:

ఓం అమరేశ్వరాయ నమ:

ఓం వ్యక్తమూర్తయే నమ:

ఓం చతుర్బాహవే నమ:

ఓం నాగయజ్ణోపవీతినే నమ:

ఓం అమూర్తకాయ నమ:

ఓం శక్తిసయుతాయ నమ:

ఓం శ్రీకంఠాయ నమ:

ఓం పార్వతీశంకరోత్చంగఖేల నమ:

ఓం చతురాయి నమ:

ఓం వ్రతినే నమ:

ఓం నోత్చవలాలనాయ నమ:

ఓం లంబోదరాయ నమ:

ఓం మూలకంఠాయ నమ:

ఓం సమస్త జగదాధార నమ:

ఓం శూర్పకర్ణాయ నమ:

ఓం త్రయికర్ర్తే నమ:

ఓం వరముషకశానయ నమ:

ఓం హేరంబాయి నమ:

ఓం సామఘెషప్రియా నమ:

ఓం హృష్టస్తుతాయ నమ:

ఓం బహ్మవత్తమాయ నమ:

ఓం పురుషోత్తమాయ నమ:

ఓం సర్వ సిద్ది ప్రియ కాయ నమ:

ఓం కాలయ నమ:

ఓం స్ధూలతుండాయ నమ:

ఓం సిద్దలక్ష్మి గణపతయే నమ:

భక్తి అంటే కూర్చుని భజన చేయడం, లేకపోతే పేరును తలచుకోవడమో, పారాయణ చేసుకోవటం, సత్సంగాలు చేసుకొవడం మాత్రమే కాదు.

మనం ఏ పని చేసినా ప్రతి అడుగు భగవంతుని వైపుకు వేయాలి.

ఏ రకంగా వేస్తే భగవంతుని వైపుకి చేరుతామో అది "భక్తి".

అది మన జీవితంలో ఒక భాగం కావటం కాదు, మన జీవితమే దాంట్లో భాగం కావాలి. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు ఏదైనా సరే భగవంతున్ని కేంద్రంగా చేసుకుపోవాలి,అదే నిజమైన భక్తి.

Have a great day!
Read more...

English Summary

This page tells you about aarti for ganesh pooja ,how to Perform Ganesh Chaturthi Pooja.