మానవ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, ఒడుదొడుకులు, లాభనష్టాలు అన్నీ గ్రహాల స్థితిగతులు, దృష్టిపైనే ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. కుటుంబంలో సమస్యలు లేదా జాతక దోషాలు ఎదురైనప్పుడు చాలామంది పండితులు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలని సూచిస్తుంటారు. అయితే, ఈ నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు సరైన పద్ధతులు, నియమాలు పాటించినప్పుడే పరిపూర్ణ సత్ఫలితాలు లభిస్తాయి.
ఆన్ లైన్ లో జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారా? అయితే తీవ్ర హెచ్చరిక!
ఎడమ వైపు నుంచి కుడి వైపునకు
శాస్త్ర ప్రకారం ఉదయాన్నే స్నానం చేసి, పవిత్రమైన సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్లాలి. నవగ్రహ మండపంలోకి ప్రవేశించే ముందు సూర్యభగవానుడిని దర్శించుకోవాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు విగ్రహాలను చేతితో తాకకూడదు. ముందుగా సూర్యుడి నుంచి మొదలుపెట్టి ఎడమవైపు నుంచి (చంద్రుడి దిశగా) కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత రాహు, కేతువులను శాంతింపజేసేందుకు అపసవ్య దిశలో (కుడి నుంచి ఎడమకు) 2 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. చివరగా ఒక్కో గ్రహాన్ని స్మరిస్తూ ఒక్కో ప్రదక్షిణ చేసి, గ్రహాలకు వీపు భాగం ఎదురుగా రాకుండా పక్కగా వెనక్కి రావాలి.
కాళ్లు కడుక్కోవాలా? వద్దా? ప్రదక్షిణలు చేసే క్రమంలో ప్రతి ప్రదక్షిణకు ఆయా గ్రహానికి సంబంధించిన శ్లోకాలను మనసులో ధ్యానించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సమగ్ర నవగ్రహ శ్లోకం: "ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ | దీనితో పాటు ఒక్కో గ్రహానికి ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి: సూర్యుడు: చంద్రుడు: కుజుడు: బుధుడు: గురువు: శుక్రుడు: శని: రాహువు: కేతువు: ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత దోష తీవ్రత ఉన్న గ్రహానికి అనుగుణంగా ప్రమిదల్లో నవధాన్యాలు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, సంబంధిత ధాన్యాలను దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
నవగ్రహ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? అనే అంశంపై చాలామందిలో సందేహాలు ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల్లో నవగ్రహ ప్రదక్షిణల అనంతరం కాళ్లు కడుక్కోవాలనే కచ్చితమైన నియమమేదీ లేదు. అయితే, శనిదేవునికి ప్రత్యేక పూజలు లేదా తైలాభిషేకాలు చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి. శనికి చేసే తైలాభిషేకం వల్ల నవగ్రహ పరిసరాలు నూనెతో జిడ్డుగా మారుతాయి కాబట్టి, కాళ్లు కడుక్కోకుండా ప్రధాన ఆలయంలోకి వెళ్తే కాళ్లు జారిపడే ప్రమాదం ఉంటుంది. అందుకే నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కుని ప్రధాన శివాలయానికి లేదా ఇతర దైవ దర్శనానికి వెళ్లడం ఆచారంగా మారింది.తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||"
"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ||"
"దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం ||"
"ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ||"
"ప్రియంగు కలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ||"
"దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||"
"హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ||"
"నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||"
"అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ||"
"పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ||"