వాస్తు ప్రకారం.. మనీ మాగ్నెట్ ఈ రన్నింగ్ బుల్ వాల్ పెయింట్

ఆధునిక గృహాలంకరణలో ఇప్పుడు వాస్తు నియమాలకు ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఇళ్లను అందంగా మార్చుకోవడంతో పాటు సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని ఆకర్షించేందుకు అవసరమైన వాల్ పెయింట్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. వీటిల్లో బుద్ధుడు, ఏడు గుర్రాలు, రన్నింగ్ బుల్ వంటి పెయింటింగ్‌లను కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. వాస్తు ప్రకారం.. వీటిని ఇంట్లో అనువైన ప్రదేశాలలో అమర్చుకోవడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.

Advertisement

వాస్తు ప్రకారం రన్నింగ్ బుల్.. ఇంటికి అందాన్ని తెచ్చే వాల్ పెయింట్ గా మాత్రమే కాదు.. జీవితంలో ఎదుగుదలను, అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగే నూతన ఉత్సాహాన్ని ఇచ్చే శక్తివంతమైన చిహ్నం కూడా. మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ఎద్దుకు విశిష్ట స్థానం ఉంది. పరమశివుడి వాహనమైన నంది రూపంగా పూజించే ఎద్దు, అపరిమితమైన సహనానికి, నిబద్ధతకు, నమ్మకానికి నిదర్శనం. పురోగతి, ఆర్థిక పటిష్టతకు ఇది సంకేతం.

Advertisement

మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తితో పాటు మనలోని బద్ధకాన్ని సైతం దూరం చేసి, పట్టుదలతో ముందుకు సాగేలా నిరంతరం ప్రేరేపిస్తూ ఉంటుందీ వాల్ పెయింట్. చాలా ఇళ్లలో ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ, చేతిలో డబ్బు నిలవకుండా అనవసరంగా, తెలియకుండానే ఖర్చు అవుతుంటంది. మరికొందరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో లేదా వర్క్‌ప్లేస్‌లో ఈ రన్నింగ్ బుల్ వాల్ పెయింట్ ను సరైన దిశలో ఉంచడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

మాజీ సీఎం సిద్ధరామయ్య రాజకీయ సన్యాసం- 50 ఏళ్ల ప్రయాణానికి భావోద్వేగ ముగింపు
Advertisement

ఈ చిత్రం ఇంట్లోని నెగెటివ్ వైబ్స్‌ను దూరం చేయడమే కాకుండా, నూతన ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవసరమైన అవకాశాలను సృష్టిస్తుందని విశ్వసిస్తారు. షేర్ మార్కెట్‌లో లాభాలను, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సూచించడానికి సాధారణంగా రన్నింగ్ బుల్ ను సింబాలిక్ గా వాడుతుంటారు. అదే గ్రోత్ మన జీవితంలో కూడా ఉంటుందనే విశ్వాసిస్తారు. ఉద్యోగులు తమ ఆఫీస్ డెస్క్ ఈ రన్నింగ్ బుల్ ఫోటో గానీ విగ్రహాన్ని గానీ ఉంచడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

టీమిండియాలో గాయాల బెడద- రాబోయే సిరీస్ నుంచి అయిదుమంది అవుట్?
Advertisement

కుటుంబ సభ్యులలో తరచూ గందరగోళం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటి పరిస్థితులకు ఈ వాల్ పెయింట్ ఓ చక్కని పరిష్కారం కూడా. ఎద్దు తన అపరిమితమైన శక్తికి ప్రసిద్ధి. ఈ ప్రతిమను లేదా పెయింటింగ్‌ను ప్రతిరోజూ చూడటం వల్ల కుటుంబ సభ్యుల్లో ఒక నూతన ఉత్తేజం, ధైర్యం కలుగుతాయి. పని ఒత్తిడి తగ్గి స్థిరత్వం ఏర్పడటంతో పాటు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయాలనే నిశ్చయం పెరుగుతుంది.

ఉత్తరం లేదా వాయువ్యం దిశలో ఈ వాల్ పెయింట్ ను ఉంచడం నూతన అవకాశాలను ఆహ్వానించినట్టవుతుంది.. నాయకత్వ లక్షణాలు పదునెక్కుతాయి. నైరుతిలో ఉంచడం వల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. ఈ వాల్ పెయింట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్ రూమ్ లేదా రెస్ట్ రూమ్ లల్లో ఉంచకూడదు.

English Summary

Running Bull Paint in Home as Per Vastu says Unstoppable Energy for Career Success and Excellent Benefits. It reflects courage and hard work, helping people push past business hurdles. Used as a guiding metaphor, it can support faster decision-making.